నిర్మాత సురేష్ బాబు వ్యవహరాల దగ్గర నిక్కచ్చిగా వుంటారు. అలాంటి ఆయనకే బాకీలు పెట్టేవాళ్లూ వుంటారు. ఓ నిర్మాత తన మూడు అక్షరాల పేరున్న సినిమా ఆఖరి దశలో కోటిన్నర అడ్జస్ట్ మెంట్ కోసం సురేష్ బాబును పట్టుకున్నట్లు తెలుస్తోంది.
సరే అని ఈయన ఇచ్చారు. అంతే. ఇక ఆ డబ్బులు రాలేదట. ఫోన్ చేస్తే లేపలేదట. మనిషి నుంచి సమాధానం లేదట. పైగా ఆ సినిమా తరువాత ఈ నిర్మాత మళ్లీ ఇప్పటి దాకా సినిమా తీయలేదు. ఎవ్వరూ డేట్లు ఇవ్వలేదు. అదంతా వేరే వ్యవహారం.
సరే, కట్ చేస్తే, సదరు నిర్మాత ఇటీవల వెంకీ డేట్లు కావాలి, సినిమా తీస్తాను అంటూ వెంటపడడం ప్రారంభించాడట. అయితే నేరుగా రాకుండా కబుర్ల మీద కబుర్లు పెడుతూ, తెగ ప్రాధేయపడిపోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో సురేష్ బాబు సింపుల్ గా సింగిల్ లైన్ ఆన్సర్ పంపేసినట్లు వినికిడి. 'ముందు ఆ మూడు అక్షరాల సినిమా విడుదల టైమ్ లో తీసుకున్న కోటిన్నర పంపించమను. అప్పుడు వెంకీ డేట్ల సంగతి చూద్దాం' అన్నారట. ఇంకేముంది. ఖేల్ ఖతమ్. దుకాణ్ బంద్. అట్నుంచి ఇక డేట్ల కోసం కబురే లేదని తెలుస్తోంది.