నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ పాత జోష్ పుంజుకున్నారు డైరక్టర్ తేజ. ఆ జోష్ తోనే బాలయ్య తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు పట్టేసారు. అంతకు ముందే వెంకీతో ఒక సినిమాను ఓకె చేసుకున్నారు.
అయితే బాలయ్య ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు పక్కన పెడతారేమో? వెంకీ కూడా హిందీ సినిమా రీమేక్ పై దృష్టి పెడతారేమో అని అనుకున్నారంతా.
కానీ కాదని తెలుస్తోంది. బాలకృష్ణ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు ఇంకా కాస్త టైమ్ వుందట. మార్చి నుంచి కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లదని తెలుస్తోంది. అంత వరకు ప్రీ ప్రొడక్షన్ పనులే. అందువల్ల ఈ నాలుగు నెలల్లో వెంకీ సినిమాను ఫినిష్ చేసేయాలని తేజ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు నిత్యం సురేష్ సమక్షంలో రామానాయుడు స్టూడియోలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వినికిడి. మరి తేజ నాలుగు నెలలు, అంటే జస్ట్ 120రోజుల్లో సినిమా ఫినిష్ చేసేస్తారా? వెంకీ రెడీగానే వున్నారు. సురేష్ ప్లానింగ్ వుంటుంది. అయినా చూడాలి మరి.