స్పైడర్ వడ్డీలు 16 కోట్లు?

డైరక్టర్లకు పెర్ ఫెక్షన్ తప్ప వేరు పట్టదు. ఎంత సేపూ వాళ్ల చెక్కుడు వాళ్లేదే. పోనీ అలా అని అందరూ అలా చెక్కి బాహుబలి సిరీస్ లు అందిస్తారా అంటే అదీ కాదు.  స్పైడర్…

డైరక్టర్లకు పెర్ ఫెక్షన్ తప్ప వేరు పట్టదు. ఎంత సేపూ వాళ్ల చెక్కుడు వాళ్లేదే. పోనీ అలా అని అందరూ అలా చెక్కి బాహుబలి సిరీస్ లు అందిస్తారా అంటే అదీ కాదు.  స్పైడర్ సినిమాకు మురుగదాస్ చేసిందిదే. తమిళ సినిమా తమిళ్ నే, తెలుగు సినిమా తెలుగునే. పెర్ ఫెక్షన్ ముఖ్యం. అంటూ ప్రతి సీన్ రెండు సార్లు తీసుకుంటూ వచ్చారు. దేని టేక్ లు దానివే. పైగా ఒకటి చేసాక, రెండోది ఇంప్రూవైజ్ అయితే, మళ్లీ మొదటిది మొదటికి వస్తుంది. 

ఇలా లెక్కలేకుండా వర్కింగ్ డేస్ పెంచుకుంటూ వెళ్లిపోయారు. దాంతో ఏమయింది. ఫైనాన్స్ మొత్తాలకు వడ్డీల భారం పెరిగిపోతుంది. స్పైడర్ సినిమా కోసం నిర్మాతలు కేవలం వడ్డీలకే 16కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ దగ్గర, ప్రయివేట్ గా తెచ్చిన ఫైనాన్స్ కు 16కోట్ల వరకు వడ్డీ కట్టడం అంటే మాటలు కాదు కదా?

ఇదే కనుక మురుగదాస్ తన తమిళ చాదస్తం తగ్గించుకుని వుంటే, కనీసం అయిదారు కోట్లు మిగిలేవి. దీనికి తోడు బాహుబలి 2తరువాత క్వాలిటీ గ్రాఫిక్స్ అవసరం అని డిసైడ్ కావడంతో అదో ఇరవై కోట్ల వరకు పెరిగింది. వాస్తవానికి దీనికి పెట్టుకున్న బడ్టెట్ కు ఇది డబుల్ అని వినికిడి. సినిమాకు మాంచి బిజినెస్ వస్తోంది. అలా వస్తున్నపుడు మనం ఖర్చు పెట్టకపోతే ఎలా అని చెప్పి, నిర్మాతల తలపై మరో ఇరవై కోట్ల భారం పెట్టించారని టాక్ వినిపిస్తోంది.