సమంత రికార్డును సమం చేస్తుందా..?

హీరో అయినా, హీరోయిన్ అయినా ఈ కాలం హ్యాట్రిక్ కొట్టాలంటే మామూలు విషయం కాదు. అది కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ అంటే నిజంగా గొప్ప విషయమే. అలాంటి హ్యాట్రిక్ కు అడుగు…

హీరో అయినా, హీరోయిన్ అయినా ఈ కాలం హ్యాట్రిక్ కొట్టాలంటే మామూలు విషయం కాదు. అది కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ అంటే నిజంగా గొప్ప విషయమే. అలాంటి హ్యాట్రిక్ కు అడుగు దూరంలో ఉంది మెహ్రీన్. 

కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ సినిమా హిట్ అయింది. తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని, మళ్లీ ఇన్నాళ్లకు మహానుభావుడు సినిమా చేసింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మెహ్రీన్.. త్వరలోనే రాజా ది గ్రేట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా కూడా హిట్ అయితే.. మెహ్రీన్ కెరీర్ లో హ్యాట్రిక్ పడినట్టే. అది కూడా కెరీర్ స్టార్టింగ్ లో చేసిన మొదటి 3 సినిమాలతోనే సక్సెస్ లు అందుకున్న హీరోయిన్ గా రికార్డు సృష్టిస్తుంది. గతంలో సమంత విషయంలో ఇలానే జరిగింది. వస్తూనే వరుసగా హిట్స్ కొట్టింది. ఇప్పుడు మెహ్రీన్ ఆ మేజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాలి.