ఇంతాచేసి చేసిందిదా?

ప్రభుత్వాలు చేసే పనుల ఇలాగే వుంటాయి. హడావుడి ఎక్కువ. అసలు తక్కువ. తెలంగాణ ప్రభుత్వం నేరుగా సినిమా టికెట్ ల పోర్టల్ ను నిన్నటికి నిన్న ప్రారంభించింది. tsboxoffice.in పేరుతో. దీంతో సినిమా అభిమానులు…

ప్రభుత్వాలు చేసే పనుల ఇలాగే వుంటాయి. హడావుడి ఎక్కువ. అసలు తక్కువ. తెలంగాణ ప్రభుత్వం నేరుగా సినిమా టికెట్ ల పోర్టల్ ను నిన్నటికి నిన్న ప్రారంభించింది. tsboxoffice.in పేరుతో. దీంతో సినిమా అభిమానులు సంబర పడ్డారు. ఇప్పటికే వున్న టికెట్ బుకింగ్ ఏప్ లు సర్వీస్ చార్జీలు కొన్ని వసూలు చేస్తాయి.

ప్రభుత్వం కనుక అలాంటిది ఏమీ వుండదని భావించారు. అలాగే పెద్ద సినిమాలు వస్తున్నపుడు ఈ టికెట్ బుకింగ్ ల ఏప్ ల్లో కూడా మతలబులు వుంటున్నాయని ఆరోపణలు, విమర్శలు వున్నాయి. ప్రభుత్వం పోర్టల్ కనుక అలాంటివి ఏమీ వుండవని అందరూ అనుకున్నారు. తీరా చేసి వెబ్ సైట్ ఓపెన్ చేస్తే, ఏదోదే కనిపిస్తోంది. 
సినిమా హాళ్ల జాబితా, ఎన్ రోల్ మెంట్ ఇలా కామన్ ఆడియన్స్ కు పనికి వచ్చేది మాత్రం లేదు. ఆఖరికి ఆన్ లైన్ బుకింగ్ లోకి వెళ్తే, ఇప్పటికే వున్న అరడజనుకు పైగా టికెట్ బుకింగ్ ఏప్ ల లింక్ లు మాత్రం వున్నాయి అక్కడ. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లి బుక్ చేసుకోవాలన్నమాట.

నేరుగా బుక్ మై షో కో, జస్ట్ టికెట్స్ కో వెళ్లకుండా, ఈ పోర్టల్ లోకి వెళ్లి, మళ్లీ అక్కడి నుంచి ఆ పోర్టల్ కు. ముక్కు ఏదీ అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్లుంది వ్యవహారం.

మరి ఇలాగే కొనసాగిస్తారో? లేదా ఒక్కో థియేటర్ ను పోర్టల్ పరిథిలోకి తీసుకువచ్చి, అప్పుడు స్వంతంగా ఆన్ లైన్ టికెటింగ్ స్టార్ట్ చేస్తారో అన్నది తెలియదు. థియేటర్లు ఎన్ రోల్ చేసుకోవాలంటూ ఫార్మ్ మాత్రం లోడ్ చేసారు. తప్పని సరి అయితే కాదు. మరి అలాంటపుడు ప్రయవేట్ పోర్టల్స్ ను తట్టుకుని  ఎలా నిలబడుతుందో చూడాలి.