స్పైడర్‌ తమిళంలోను ఫ్లాపే

స్పైడర్‌కి ఆరంభంలో తమిళనాడునుంచి మంచి స్పందన కనిపించింది. తెలుగు క్రిటిక్స్‌ మూకుమ్మడిగా ఫెయిల్యూర్‌ అని డిక్లేర్‌ చేయగా, తమిళంలో పలువురు విమర్శకులు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. మహేష్‌ని ఒక స్టార్‌లా కాకుండా ఒక మామూలు…

స్పైడర్‌కి ఆరంభంలో తమిళనాడునుంచి మంచి స్పందన కనిపించింది. తెలుగు క్రిటిక్స్‌ మూకుమ్మడిగా ఫెయిల్యూర్‌ అని డిక్లేర్‌ చేయగా, తమిళంలో పలువురు విమర్శకులు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. మహేష్‌ని ఒక స్టార్‌లా కాకుండా ఒక మామూలు యాక్టర్‌లా చూడడం వల్ల వారికి ఈ చిత్రం నచ్చిందని అనుకున్నారు. అలాగే టాక్‌ బెటర్‌ అయి తమిళంలో విజయ పథంలో వెళుతుందని భావించారు.

అయితే 'స్పైడర్‌' తమిళంలో కూడా పూర్తిగా డ్రాప్‌ అయింది. మొత్తంగా పది కోట్ల షేర్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. పద్ధెనిమిది కోట్లు ప్లస్‌ ఖర్చులకి ఈ రైట్స్‌ తీసుకున్నారు కనుక దాదాపు సగం డబ్బులు నష్టపోక తప్పదన్నమాట. తెలుగు వెర్షన్‌ కూడా ఇంచుమించు ఇలాగే పర్‌ఫార్మ్‌ చేస్తోంది. మహేష్‌ స్ట్రాంగ్‌ ఏరియా అయిన నైజాంలో కూడా సింగిల్‌ డిజిట్‌ లక్షల్లో షేర్లు వస్తున్నాయి కనుక ఇక పుంజుకునే అవకాశాలు దాదాపు శూన్యం.

పెట్టుబడి భారీ స్థాయిలో వుండడంతో లాస్‌ పరంగా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించేట్టుంది. ఓవరాల్‌గా ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌పై అరవై కోట్లకి పైగానే నష్టం వుంటుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. వరుసగా రెండు ఘోర పరాజయాలు వచ్చినా కానీ, తదుపరి రాబోయేది కొరటాల శివ సినిమా కావడం మహేష్‌ ఫాన్స్‌కి ఊరటనిస్తోంది.