ఆ ఏంకర్ తో ఏటిట్యూడ్ సమస్య?

ఇండస్ట్రీలో ఎవరైనా ఏ లెవెల్ కు అయినా ఎదగవచ్చు. కానీ ఏటిట్యూడ్ మాత్రం డౌన్ టు ఎర్త్ వుండాల్సిందే. అలా కాకపోతే భరించడం కష్టం అవుతుంది. ఈ మధ్య ఓ సినిమా సెలబ్రిటీ డిఫరెంట్…

ఇండస్ట్రీలో ఎవరైనా ఏ లెవెల్ కు అయినా ఎదగవచ్చు. కానీ ఏటిట్యూడ్ మాత్రం డౌన్ టు ఎర్త్ వుండాల్సిందే. అలా కాకపోతే భరించడం కష్టం అవుతుంది. ఈ మధ్య ఓ సినిమా సెలబ్రిటీ డిఫరెంట్ టీవీ షో చేయాలనున్నారు. అందుకోసం ఓ ఏంకర్ ను తీసుకున్నారు. అప్పడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుండడంతో షో కి ప్లస్ అవుతుందని ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ తీరా చేసి షో షూట్ చేయడం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే సదరు ఏంకర్ ఏటిట్యూడ్ తో సమస్యలు ప్రారంభమైనట్లు వినికిడి. దీంతో అర్జెంట్ గా సదరు ఏంకర్ కు ఉద్వాసన చెప్పి, వేరే ఏంకర్ ను తీసుకున్నారట. ఆ ఏంకర్ కూడా సిన్మాల్లో అడపదడపా వేషాలు వేసే అమ్మాయే. ఆ అమ్మాయికి కూడా కాస్త క్రేజ్ వుంది. అందువల్ల రీప్లేస్ మెంట్ సులువు అయింది. ఈ ఏంకర్ కు ఓ షో మిస్సయిందన్నది టాలీవుడ్ గుసగుసల సారాశం.

ఇదే ఏంకర్ ఓ సినిమా షూట్ లో కూడా ఇలాగే చేసిందని, వేరే యూనిట్ లో తనను బ్రహ్మాండంగా చూస్తారని, ఈ యూనిట్ లో అలా చూడడం లేదని హల్ చల్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. చిత్రమేమిటంటే, టీవీ షో యూనిట్ కు, సినిమా యూనిట్ కు కాస్త బంధం వుండడం. రెండు చోట్లా ఆ ఏంకర్ ఎందుకలా చేసినట్లో?