హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ పంట పడింది. మరో మాంచి సినిమా చేతిలో పడింది. చిన్న మీడియం సినిమాలతో స్టార్ట్ అయిన అను ఏక్టింగ్ టాలెంట్ పై దర్శకుడు త్రివిక్రమ్ దృష్టి పడింది. దర్శకుడు త్రివిక్రమ్ కు నచ్చాలే కానీ అవకాశాలకు కొదవ వుండదు. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ వచ్చేసింది. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చేసింది అన్న టైమ్ లో అదే ప్రొడక్షన్ హవుస్ లో మరో సినిమా అందేసింది.
హారిక హాసిని సోదర సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే నాగ చైతన్య-మారుతి సినిమాలో హీరోయిన్ గా అను నే ఎంపిక చేసినట్లు వెల్లడియింది. హారిక హాసిని అనే ప్రొడక్షన్ హవుస్ లో త్రివిక్రమ్ ఆమోద ముద్ర లేకుండా చిన్న నిర్ణయం కూడా తీసుకోరు.
అలాంటిది నాగ చైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నారంటే, కచ్చితంగా త్రివిక్రమ్ సిఫార్స్ వుండే వుంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే తన ఏక్టింగ్ టాలెంట్ తో అను తొలి సినిమాతోనే త్రివిక్రమ్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది అన్నమాట.
ఇప్పటికే అను అల్లు అర్జున్ సరసన కూడా చేస్తోంది. పవన్, బన్నీ, నాగ చైతన్య ఇలా మాంచి సినిమాలు వరుసగా వున్నాయి అను చేతిలో ఇప్పుడు. వీటి ట్రాక్ రికార్డ్ బాగుంటే, రకుల్ ప్రీత్ సింగ్ మాదిరిగా టాలీవుడ్ హీరోలందరినీ ఓ రౌండ్ వేసేస్తుంది అను కూడా.