మహానుభావుడు హిట్ తో జోరు మీద వున్నాడు శర్వానంద్. తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ అందించే సినిమాలు రెండు కమిట్ అయివున్నాడు.
అయితే ఏది ముందు, ఏది వెనుక అన్నది డిసైడ్ కాలేదు. ప్రకాష్ సినిమాకు ఫారిన్ షెడ్యూలు వుంది. ఆ వీసాలు, పర్మిషన్లు బట్టి, ఏ సినిమా ముందు అన్నది డిసైడ్ అవుతుంది.
మాఫియా లీడర్ గా ఎదిగిన కుర్రాడి కథతో సుధీర్ వర్మ స్క్రిప్ట్ తయారుచేసుకున్నాడు. ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. రెండో షేడ్ గెటప్ పూర్తిగా డిఫరెంట్ గా వుంటుంది. అందుకే ప్రకాష్ సినిమా, సుధీర్ వర్మసినిమా కనుక సమాంతరంగా చేస్తే, ఈ విభిన్న గెటప్ సీన్లు చివరిలో తీసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదిలా వుంటే శతమానంభవతి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న శర్వా-అనుపమల మ్యాజిక్ రిపీట్ చేద్దామని సుధీర్ వర్మ చూస్తున్నారు. కానీ అనుపమ పరమేశ్వరన్ డేట్ లు దొరకడం లేదని వినికిడి. ఇక ఆమె దొరక్కపోతే, నివేథా థామస్ ను తీసుకోవాలని చూస్తున్నారు. అనుపమ ఇదే బ్యానర్ లో ఓ సినిమా గతంలో చేసింది. ఇప్పుడు ఓకె అంటే రెండో సినిమా అవుతుంది. నివేధాకు హారిక హాసిని, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయడం ఇదే ప్రథమం అవుతుంది.