ఒత్తిడి పెంచి రిస్క్ చేస్తున్నాడా..?

రెండో సినిమాతో ఎలాగైనా అఖిల్ కు ఓ హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు నాగార్జున. అందుకే 'హలో'కు తనే నిర్మాతగా కూడా మారాడు. ఏ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాకుండా, మ్యాగ్జిమమ్ టైం తీసుకొని…

రెండో సినిమాతో ఎలాగైనా అఖిల్ కు ఓ హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు నాగార్జున. అందుకే 'హలో'కు తనే నిర్మాతగా కూడా మారాడు. ఏ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాకుండా, మ్యాగ్జిమమ్ టైం తీసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో నాగ్ చేస్తున్న పనులు సినిమాపై ప్రభావం చూపించేలా ఉన్నాయి.

అఖిల్-విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న హలో సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయింది. కానీ ఇప్పటికీ కొంత కీలకమైన షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇలాంటి టైమ్ లో దర్శకుడిపై ఒత్తిడి పెంచుతున్నాడు నాగార్జున. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 22కు విడుదల చేయాలనే ఉద్దేశంతో రోజూ 2 సార్లు విక్రమ్ కుమార్ కు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నాడు.

అఖరి నిమిషంలో చుట్టేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. మరీ ముఖ్యంగా విక్రమ్ కుమార్ లాంటి దర్శకుడికి వీలైనంత టైమ్ ఇవ్వకపోతే హలో విషయంలో రిజల్ట్ తేడాకొట్టే ప్రమాదముంది. ఇదే నిర్మాత.. ఇదే దర్శకుడికి మనం సినిమా విషయంలో కావాల్సినంత స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఇప్పుడు హలో విషయంలో ఇలా డెడ్ లైన్లు పెట్టి లేనిపోని ఒత్తిళ్లు పెంచుతున్నాడు.

అయితే ఇక్కడ నిర్మాతగా నాగార్జునను కూడా తప్పుపట్టలేం. డిసెంబర్ మిస్ అయితే సంక్రాంతి సినిమాలొచ్చేస్తాయి. ఆ తర్వాత బాక్సాఫీస్ కు అన్-సీజన్ మొదలైపోతుంది. ఆ వెంటనే స్కూల్స్ తెరిచేస్తారు. మళ్లీ సమ్మర్ వరకు ఆగాలి. అప్పుడు మళ్లీ పోటీ తప్పదు. అందుకే డిసెంబర్ 22కే సినిమాను తీసుకురావాలనేది నాగ్ ప్లాన్.