వర్మతో నాగార్జున: అతిపెద్ద తప్పు

వర్మ-నాగ్ కాంబినేషన్ లో శివ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అప్పట్లో తెలుగు సినిమా రూపురేఖల్నే మార్చేసింది ఆ సినిమా. తర్వాత వీళ్లిద్దరూ కలిసి గోవింద గోవింద సినిమా చేశారు. అది ఫ్లాప్ అయింది.…

వర్మ-నాగ్ కాంబినేషన్ లో శివ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అప్పట్లో తెలుగు సినిమా రూపురేఖల్నే మార్చేసింది ఆ సినిమా. తర్వాత వీళ్లిద్దరూ కలిసి గోవింద గోవింద సినిమా చేశారు. అది ఫ్లాప్ అయింది.

నాగార్జున-వర్మ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అప్పట్లో చాలామంది అభిమానులు కోరుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ కాకూడదని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు సినిమా సెట్ అయింది. అదే విచిత్రం.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో, అవి ఎలా డిజాస్టర్లుగా మారుతున్నాయో అందరం చూస్తున్నాం. అతడిలో మేటర్ అయిపోయిందని అంతా ఫిక్స్ అయిపోయారు. అందరి అభిప్రాయాలకు తగ్గట్టుగానే సినిమాలు తీస్తున్నాడు వర్మ. చివరికి ఎవరూ అవకాశం ఇవ్వకపోవడంతో వివాదాస్పద కథలు (లక్ష్మీస్ ఎన్టీఆర్) కెలుకుతున్నాడు. విజయ్ దేవరకొండ లాంటి హీరోలను పొగిడే పని పెట్టుకున్నాడు.

ఇలాంటి టైమ్ లో నాగ్-వర్మ కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకు అది పెద్ద షాకింగ్ న్యూస్. ఒకప్పుడు తను తీసిన సర్కార్, రంగీలా, సత్య, రాత్రి లాంటి సినిమాల్నే తిప్పి తిప్పి తీస్తున్న వర్మ.. నాగ్ కు మరో ఫ్లాప్ ఇవ్వడం మినహా ఏం చేయలేడంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్స్ ప్రవాహం మొదలైంది. ఈ 20 ఏళ్లలో వర్మకు ఒక్క అవకాశం కూడా ఇవ్వని నాగార్జున.. ఇలాంటి టైమ్ లో వర్మతో సినిమా చేయడం ఏంటంటూ నాగ్ పై కూడా కామెంట్స్ పడుతున్నాయి.