సంకల్ప్.. వరుణ్.. పివిపి

ఘాజీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో వినిపించిన పేరు సంకల్ప్ రెడ్డి. అలాంటి కీలకమైన, భారీ సబ్జెక్ట్ ను అంత మీడియం బడ్జెట్ లో తీయడం ఒకఎత్తు. అలాంటి డ్రై సబ్జెక్ట్ ను సినిమాగా మార్చి,…

ఘాజీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో వినిపించిన పేరు సంకల్ప్ రెడ్డి. అలాంటి కీలకమైన, భారీ సబ్జెక్ట్ ను అంత మీడియం బడ్జెట్ లో తీయడం ఒకఎత్తు. అలాంటి డ్రై సబ్జెక్ట్ ను సినిమాగా మార్చి, ప్రేక్షకులను మెప్పించడం మరోఎత్తు. ఈ రెండూ సక్సెస్ ఫుల్ గా చేసిన సంకల్ప్ రెడ్డి తన తరువాతి సినిమాకు మాంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు హీరోను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలు అంటే ముందుకు వచ్చే మెగా హీరో వరుణ్ తేజతో చేయాలని డిసైడ్ అయ్యాడు.

వరుణ్ వైపు నుంచి ప్రాజెక్టు కు, స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సరైన నిర్మాత కోసం అన్వేషించి, ఆఖరికి మళ్లీ తనకు తొలి చాన్స్ ఇచ్చిన పివిపి దగ్గరకే వచ్చి ఆగాడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు అక్కడ డిస్కషన్ లు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఏ నిర్ణయమూ బయటకు వస్తుంది. స్క్రిప్ట్ బాగుండడం, డైరక్టర్ స్టామినా ఏమిటి అన్నది తెలియడం, హీరో రెడీగా వుండడంతో, బహుశా నిర్మాత పివిపి కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యే అవకాశం వుంది.