ఈ నెలలో థియేటర్లలోకి వస్తున్న హీరోలందరిదీ ఒకటే పరిస్థితి. నాగార్జున, రవితేజ, గోపీచంద్, రామ్.. ఇలా హీరోలంతా ఒకే నెలలో వస్తున్నారు. తమ అప్ కమింగ్ మూవీస్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నారు వీళ్లంతా.
ఈ ఏడాది ఓం నమో వేంకటేశాయ సినిమాతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న నాగ్.. తన హోప్స్ అన్నీ రాజుగారి గది-2పైనే పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం హారర్-కామెడీ జానర్ లో, ఓంకార్ దర్శకత్వంలో నాగ్ నటించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలకానుంది.
రవితేజది కూడా సేమ్ సిచ్యువేషన్. లాస్ట్ ఇయర్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాడు. అంతకుముందు ఏడాది కూడా అన్నీ ఫ్లాపులే. అలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా దీపావళి కానుకగా ఈనెల 18 లేదా 19న విడుదలకానుంది. ఈ సినిమాతో రవితేజ కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే మరోసారి 2012నాటి చేదు అనుభవాలు (అన్నీ ఫ్లాపులే) చవిచూడాల్సి వస్తుంది.
హిట్ కోసం పరితపిస్తున్న గోపీచంద్ కూడా ఈనెలలోనే థియేటర్లలోకి వస్తున్నాడు. ఎప్పుడో రావాల్సిన ఆక్సిజన్ సినిమా ఎట్టకేలకు ఈ నెలలో విడుదలకు ముస్తాబైంది. తాజాగా ట్రయిలర్ కూడా విడుదల చేశారు. అక్టోబర్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో గోపీచంద్ కూడా కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే అతడి మార్కెట్ మరింత డల్ అవుతుంది.
లిస్ట్ లో రామ్ కూడా ఉన్నాడు. నేను శైలజతో మాంఛి హిట్ అందుకున్న ఈ హీరో, హైపర్ తో అదే ఊపును కొనసాగించలేకపోయాడు. అందుకే సక్సెస్ కోసం మరోసారి నేను శైలజ దర్శకుడినే నమ్ముకున్నాడు. రామ్-కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కుతున్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈనెల 27న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ నెలలో వస్తున్న ఈ హీరోలందరికీ అర్జెంట్ గా ఓ హిట్ కావాలి.