ఫేస్ బుక్, వాట్సాప్: అక్కడ కష్టమే!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రెండింటికి అటు చైనా, ఇటు రష్యాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనాలో ఇప్పటికే వాట్సాప్ పై నిషేధం వేటు పడింది. దీనికి కారణం ఈమధ్య ఆ సంస్థ ప్రకటించిన…

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రెండింటికి అటు చైనా, ఇటు రష్యాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనాలో ఇప్పటికే వాట్సాప్ పై నిషేధం వేటు పడింది. దీనికి కారణం ఈమధ్య ఆ సంస్థ ప్రకటించిన “ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్” పాలసీనే.

ఈ నూతన విధానం వల్ల వాట్సాప్ లో చాటింగ్ లు అత్యంత సురక్షితంగా ఉంటాయి. ధర్డ్ పార్టీ చేతిలోకి వెళ్లవు. ఇది చైనాకు ఇష్టంలేదు. ఏ సమాచారమైనా తమ కనుసన్నల్లోనే ఉండాలని ఆదేశించిన చైనా.. వాట్సాప్ పై నిషేధం విధించింది. చైనాలో ప్రాచుర్యం పొందిన “ఉయ్ చాట్” ఈ మేరకు తమ నిబంధనలు మార్చుకుంది. ప్రభుత్వం ఎప్పుడు కోరితే అప్పుడు సమాచారాన్ని ఇస్తామనే క్లాజ్ ను చేర్చింది.

అటు రష్యాలో ఫేస్ బుక్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తమ దేశంలో అమల్లో ఉన్న డేటా స్టోరేజ్ చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ నిబంధనల్ని ఫేస్ బుక్ పాటించడం లేదని ఆరోపిస్తోంది రష్యా. తమ దేశంలో సేకరించిన సమాచారాన్ని స్థానికంగానే స్టోరేజ్ చేయాలనే కండిషన్ పెట్టింది. తమ నిబంధనల్ని తప్పకుండా పాటించాలని కోరుతూ ఫేస్ బుక్ కు 8 నెలల గడువు ఇచ్చింది రష్యా ప్రభుత్వం.