రాజమౌళి బహుముఖ వ్యూహం

దర్శకుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దిగ్దర్శకుడు అయ్యాడు. ఇప్పడు ఆయనకు ప్రత్యేకంగా నిర్మాతలు కానీ హీరోలు కానీ పిలిచి అవకాశం ఇవ్వనక్కరలేదు. రాజమౌళినే పిలిచి చాన్సిచ్చే స్టేజ్ లో వున్నాడు అటు నిర్మాతలకైనా,…

దర్శకుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దిగ్దర్శకుడు అయ్యాడు. ఇప్పడు ఆయనకు ప్రత్యేకంగా నిర్మాతలు కానీ హీరోలు కానీ పిలిచి అవకాశం ఇవ్వనక్కరలేదు. రాజమౌళినే పిలిచి చాన్సిచ్చే స్టేజ్ లో వున్నాడు అటు నిర్మాతలకైనా, ఇటు హీరోల కైనా. అయితే రాజమౌళికి పాత బాకీలు కొన్ని వున్నాయి.

నిర్మాతలు డివివి దానయ్యకు, కే ఎల్ నారాయణకు చెరో సినిమా చేయాలి. అలాగే హీరో మహేష్ బాబుకు ఓ సినిమా బాకీ. ఈ బాకీలు ఎగ్గొట్టాలి అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు రాజమౌళికి. వడ్డీతో అడ్వాన్స్ లు ఎడం చేత్తో ఇచ్చేయగలడు. కానీ రాజమౌళి ది అలాంటి వ్యవహారం కాదు. మాట అంటే మాటే.

అయితే ఇప్పుడు ఇలా మాటలు నిలబెట్టుకోవాలంటే మూడు సినిమాలు చేయాలి. అంటే మరో మూడేళ్ల దాకా పాత మాటల సినిమాలకే సరిపోతుంది. అందుకే ఇప్పుడు రాజమౌళి మూడు బాకీలను ఒక్క సినిమాతో చెల్లుబాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

డివివి దానయ్య, కెఎల్ నారాయణ నిర్మాతలుగా మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేసేస్తే సరి. ముగ్గురికి ఇచ్చిన మాటలు చెల్లియిపోతాయి. తరువాతి సినిమా తను ఎలా కావాలంటే, ఎవరికి కావాలంటే, ఎవరితో కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ మేరకు త్వరలో ప్రకటన బయటకు వచ్చే అవకాశం వందని తెలుస్తోంది. ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు, ఓ సూపర్ స్టార్ తో కలిసి రాజమౌళి సినిమా అంటే అది ఓ రేంజ్ లో వుండాలి మరి. వుంటుంది కూడా.