మహేష్ మాటతో స్పైడర్ కు తంటా

స్పైడర్ సినిమా ఎలా వుంది? మంచి చెడ్డలు కాదు ఇక్కడ. మహేష్ బాబు నోటి వెంట వచ్చిన ఒక్క మాట ఆ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు నుంచి ఎంత చేడు చేసింది…

స్పైడర్ సినిమా ఎలా వుంది? మంచి చెడ్డలు కాదు ఇక్కడ. మహేష్ బాబు నోటి వెంట వచ్చిన ఒక్క మాట ఆ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు నుంచి ఎంత చేడు చేసింది అన్నది పాయింట్. అక్కడకు మరి కాస్త ముందుకు వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ సినిమా విశ్లేషకులపై తనదైన స్టయిల్ లో సుతిమెత్తగా కామెంట్లు చేసాడు. దానికి పాజిటివ్, నెగిటివ్ గా మిక్స్ డ్ రెస్సాన్స్ వచ్చింది. కానీ పెద్దగా పైకి రేగలేదు.

కానీ మహేష్ బాబు దగ్గర మీడియా ఇదే విషయం ప్రస్తావించినపుడు 'సమీక్షలది ఏముంది? బాగుంటే బాగుందని రాస్తారు. లేదంటే లేదని రాస్తారు. నేను కూడా సమీక్షలను ఫాలో అవుతుంటా' అనేసాడు. ఆయన క్యాజువల్  గా అని వుండొచ్చు. కానీ అది ఎలా వెళ్లిందంటే, ఎన్టీఆర్ అభిప్రాయంతో మహేష్ డిఫర్ అయినట్లు, ఎన్టీఆర్ మాటలను మహేష్ కౌంటర్ చేసినట్లు వచ్చింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు చెలరేగిపోయారు. 

నెటిజన్లలో పవన్ కళ్యాణ్ తరువాత ఎన్టీఆర్ వున్నంత ఫాలోయింగ్ మిగిలిన హీరోలకు లేదనే చెప్పాలి. దాంతో యుఎస్ లో ప్రీమియర్లు ప్రారంభం కావడం భయం, స్పైడర్ ను సోషల్ మీడియాలో ఆడుకోవడం ప్రారంభమైంది. పైగా మహేష్ చెప్పిన 'సినిమా బాగుంటే సమీక్షలు బాగుంటాయి, లేదంటే లేదనే' మాటలనే పదే పదే ఎక్కడ పడితే అక్కడ ప్రస్తావిస్తూ, నానాయాగీ చేసారు. దాంతో ఇండియాలో సినిమా పడే టైమ్ కే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి, సినిమాకు చేయాల్సిన డామేజ్ చేయడం ప్రారంభించేసింది.