రాజుగారి గది 2, కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా. ఈ సినిమా ట్రయిలర్ రేపు విడుదలవుతోంది. సాధారణంగా సినిమా ట్రయిలర్ ను ఆన్ లైన్ లో వదలడం, మరీ పెద్ద సినిమా అయితే థియేటర్లలోకి వదలడం కామన్. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం. సినిమా థియేటర్లలో ట్రయిలర్ వదలాలంటే, వారానికి ఇంత అని చెప్పి, క్యూబ్, యుఎప్ఓ వంటి డిజిటల్ సంస్థలకు వారానికి ఇంత అని ఫీజు కట్టాలి.
నాగార్జున సినిమా రాజుగారి గది 2 ట్రయిలర్ ను బుధవారం ఉదయం ఆన్ లైన్ లోకి వదుల్తున్నారు. కానీ థియేటర్లలోకి వదలాలంటే సెన్సారు సర్టిఫికెట్ కావాలి. రేపు సాయంత్రం కనుక సెన్సారు ఫార్మాలిటీ అయిపోతే, గురువారం జై లవకుశ స్క్రీన్లలో ఆ సినిమాతో పాటు రాజుగారి గది 2 ట్రయిలర్ ప్రత్యక్షం అయిపోతుంది. లేదూ అంటే వన్ డే లేటుగా అటాచ్ చేస్తారు.
ఇలా సుమారు వెయ్యి స్క్రీన్లలో రాజుగారి గది 2 ట్రయిలర్ వేయడానికి ఎంత తక్కువగా చూసుకున్నా పాతిక లక్షలు ఖర్చవుతుంది. అంటే సినిమా ట్రయిలర్ తో పాటే పబ్లిసిటీ ఖర్చు పాతిక లక్షలతో బోణీ అవుతోందన్నమాట. ఈ సినిమా మీద అటు నిర్మాత పివిపి, ఇటు హీరో నాగ్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ఈ సినిమాకు ఓంకార్ దర్శకుడు.