ఎన్టీఆర్ రావణతాండవం

శివతాండవం తెలుసు. మన పురాణ సినిమాల్లో చాలాసార్లు జనం చూసారు. శివతాండవం అంటే బాగా ఫేమస్ కూడా. మరి రావణతాండవం ఏమిటి? పురాణాల్లో రావణుడు కళాప్రియుడు, స్వయంగా వీణ వాయించడం తెలిసనవాడు అని మన…

శివతాండవం తెలుసు. మన పురాణ సినిమాల్లో చాలాసార్లు జనం చూసారు. శివతాండవం అంటే బాగా ఫేమస్ కూడా. మరి రావణతాండవం ఏమిటి? పురాణాల్లో రావణుడు కళాప్రియుడు, స్వయంగా వీణ వాయించడం తెలిసనవాడు అని మన పురాణాలు, సినిమాలు చెబుతాయి. కానీ రావణుడు డ్యాన్స్ చేసినట్లు ఎక్కడా తెలియలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు కదా? అందుకే జై లవకుశ సినిమాలో రావణతాండవం అనేది ఒకటి ప్రవేశపెట్టాడట.

అంటే రావణుడు తాండవం లెవెల్లో డ్యాన్స్ చేస్తాడన్నమాట. ఇందుకోసం తమన్నాతో ప్లాన్ చేసిన అయిటమ్ సాంగ్ ను వాడుకున్నారు. ఈ పాట మధ్యలో చిన్న బిట్ లో ఎన్టీఆర్ విభిన్నంగా, బీభత్సంగా నర్తిస్తాడన్నమాట. దానికే రావణతాండవం అని పేరు పెట్టుకున్నారని వినికిడి.

ఇప్పటికే తమన్నా ఐటమ్ టీజర్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇక ఈ తాండవం బిట్ కూడా బయటకు వచ్చిందో కేకే. అయితే సినిమాలో అట్రాక్షన్ అంటూ వుండాలని దాన్ని అలా వెనక్కు వుంచారట. చూడాలి కూచిపూడి బాగా నేర్పు వున్న ఎన్టీఆర్ చేసిన ఆ రావణతాండవం ఎలా వుంటుందో?