తమిళ రాజకీయాల్లోకి కమల్ హాసన్ వస్తున్నాడనే విషయం క్లియర్. తను ఏ పార్టీకి కొమ్ముకాయనని, సొంతంగా ఓ పార్టీ పెడతానని కమల్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన పొలిటికల్ ఎంట్రీకి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు కమల్. ఎన్నికల టైమ్ కు ఓ మంచి పొలిటికల్ బేస్డ్ మూవీని దించాలని ఆలోచిస్తున్నాడు.
ఇందులో భాగంగా తెరపైకి వచ్చింది భారతీయుడు-2. కమల్-శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అవినీతిపై పోరాటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు కమల్. తన రాజకీయ రంగప్రవేశానికి ఈ సినిమానే సరైనదని భావిస్తున్నాడు.
అటు రజనీతో సినిమా చేస్తున్న శంకర్ కూడా 3-4 నెలల్లో ఫ్రీ అయిపోతాడు. నెక్ట్స్ మూవీని ఇంకా ప్లాన్ చేయలేదు. నిర్మాతగా ఓ సినిమాను స్టార్ట్ చేసినప్పటికీ, దర్శకుడిగా మాత్రం ఆయన ఖాళీనే. సో.. శంకర్ ను లైన్లో పెట్టి భారతీయుడు-2 సినిమా చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రస్తుతం కమల్ తర్జనభర్జన పడుతున్నాడు.
మరోవైపు కమల్ చేతిలో విశ్వరూపం-2 కూడా ఉంది. ఇది సందేశాత్మక చిత్రమే. కమల్ కు కాస్తో కూస్తో కలిసొచ్చే సినిమానే. ఈ మూవీ తర్వాత భారతీయుడు-2 కూడా రిలీజ్ అయితే.. “డబుల్ ఇంపాక్ట్” ఎఫెక్ట్ పనిచేస్తుందనేది కమల్ ఆలోచన. మరి ఈ 2 సినిమాల మధ్యలో ఉన్న శభాష్ నాయుడు సినిమాను ఏం చేస్తాడో చూడాలి.