ఎన్టీఆర్ డ్యాన్స్ లు విరగదీస్తాడు. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ మాట చాలదట. జై లవకుశ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నాతో కలిసి చేసిన అయిటమ్ సాంగ్ చూస్తే. ఈ పాటలో తారక్ డ్యాన్స్ చాలట అతగాడి ఫ్యాన్స్ ఫిదా అయిపోవడానికి. ఆ రేంజ్ స్టెప్ట్ వేసాడట ఎన్టీఆర్ ఆ పాటలో. ఈ పాటనే సినిమా సెకండాఫ్ కు భలే అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తోంది సినిమా యూనిట్.
అందుకే ఈ పాట ఫుల్ విడియో కాకున్నా, అందులో క్లిప్స్ అన్నా బయటకు వదిల్తే ఎలా వుంటుందీ అని ఆలోచిస్తోందట. ఆది సినిమాకు మరింత అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తోందట. సినిమాకు సాధారణంగా ఫ్యాన్స్ రిపీట్ విజిట్ చేసేందుకు ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ దోహదం చేస్తాయి. కామెడీ సీన్లు, అయిటమ్ సాంగ్ లు, హీరో స్టెప్ లు అవసరం. మామూలుగా అయితే రీపీట్ టికెట్ లు తెగవు.
జైలవకుశకు ఫ్యాన్స్ నుంచి రిపీట్ టికెట్ లు తెగడానికి ఈ అయిటమ్ సాంగ్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అంటే తమన్నాకు ఇచ్చిన 65లక్షలు బాగానే గిట్టుబాటు అయ్యే సూచనలు వున్నాయన్నమాట. ఇంతకీ తమన్నాతో చిందేసింది? లవుడా? కుశుడా? అది మాత్రం విడియో క్లిప్స్ బయటకు వస్తే తప్ప తెలియదు.