అందరికీ నిద్ర లేని రాత్రులే

పాపం నిర్మాతలను చూస్తుంటే జాలేస్తోంది. ఎందుకు సినిమాలు తీస్తున్నారో? ఎందుకు విడుదల చేస్తున్నారో? ముఖ్యంగా సినిమాలు తీయడం కన్నా, విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సినిమా విడుదల ముందు రోజు అయితే…

పాపం నిర్మాతలను చూస్తుంటే జాలేస్తోంది. ఎందుకు సినిమాలు తీస్తున్నారో? ఎందుకు విడుదల చేస్తున్నారో? ముఖ్యంగా సినిమాలు తీయడం కన్నా, విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సినిమా విడుదల ముందు రోజు అయితే ఇక వాళ్ల బాధలు పగవాడికి కూడా వద్దనిపిస్తుంది.

ఈవారం విడుదలైన కథలో రాజకుమారి, ఉంగరాల రాంబాబు వైనాలు ఇలాంటివే. ఉంగరాల రాంబాబు చాలా వరకు కిందా మీదా పడి ఆఖరికి విడుదలైంది అనిపించింది. కానీ ఆంధ్రలో మాత్రం విడుదల కాలేదు. నైజాం, సీడెడ్ ల్లో మార్నింగ్ షోలు పడ్డాయి. నిజానికి ఆంధ్రలో ప్రతి సెంటర్లో ఒకటి కన్నా ఎక్కువ ధియేటర్లు దొరికాయి. కానీ షోలు పడమలేదు పాపం.

ఇక కథలో రాజకుమారి సంగతి మీరీనూ. నిన్నల్లా, దర్శకుడు మహేష్ సూరపనేని, సినిమా విడుదలకు కిందా మీదా పడ్డారు. చిన్న సినిమా అయినా ఫైనాన్స్ కష్టాలు గట్టెక్కించి, సినిమాను విడుదల చేసేందుకు పడిన తపన ఇంతా అంతా కాదు. ఆఖరికి అర్థరాత్రి దాటేవేళకు హమ్మయ్య అనిపించుకోగలిగారు.

సినిమాలు తీయడానికి మూడు కోట్లు వుంటే ఓమాదిరిగా మంచి సినిమా బయటకు వస్తోంది. కానీ దాన్ని థియేటర్లలోకి పంపడానికే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తోంది.