అదే బ్యాంకాక్.. అదే పూరి.. కధలేమిటో?

పైసా వసూలయిపోయింది. కథ ముగిసాక భేతాళుడు మళ్లీ చెట్టెక్కేసినట్లు దర్శకుడు పూరిజగన్నాధ్ మళ్లీ బ్యాంకాక్ వెళ్లిపోయారు. అక్కడ ప్రశాంతంగా కథలు రాసుకునే పని ప్రారంభించేసారు. అయితే ఈ సారి కథలు ఎవరికోసమో? ఆ కథలేమిటో…

పైసా వసూలయిపోయింది. కథ ముగిసాక భేతాళుడు మళ్లీ చెట్టెక్కేసినట్లు దర్శకుడు పూరిజగన్నాధ్ మళ్లీ బ్యాంకాక్ వెళ్లిపోయారు. అక్కడ ప్రశాంతంగా కథలు రాసుకునే పని ప్రారంభించేసారు. అయితే ఈ సారి కథలు ఎవరికోసమో? ఆ కథలేమిటో ఇంకా అప్పుడే క్లారిటీ రాదు. కొడుకుతో సినిమా చేయాలని వుంది పూరిజగన్నాధ్ కు. కానీ అలా చేయడానికి ముందు ఓ హిట్ కొట్టడం అవసరం అని సన్నిహితులు సలహా ఇస్తున్నారు.

కొడుకు లాంటి బడ్డీ హీరోతో పూరి సినిమా చేయాలంటే ఎవరైనా హీరోతో హిట్ కొట్టి వస్తే బెటర్ అని ఆయనకు సలహాలు అందుతున్నాయి. అందుకే సీరియస్ గా కథలు అల్లే పనిలో పడ్డారు. సరైన కథ పడితే ఏదో హీరో దొరక్కపోతారా అన్నది పూరి ఆలోచన.

కానీ ఒకటే సమస్య. అదే బ్యాంకాక్, అదే పూరి. మళ్లీ అదే టైపు కథలు అల్లుతారా? లేక పొరపాటున మాంచి కథలు తయారు చేసేస్తారా? అన్నది అనుమానం. ఇప్పటికి ఎన్నిసార్లు బ్యాంకాక్ వెళ్లలేదు. ఎన్ని కథలు అల్లలేదు. ఎన్ని ఫ్లాపులు చూడలేదు. ఈసారి ఏం చేస్తారో? ఎవరు దొరుకుతారో? వెయిట్ అండ్ సీ.