తన అభిమానుల్లాంటి వారు వేరే ఏ హీరోకు వుండరంటూ మహేష్ బాబు ఓ కొత్త పాయింట్ చెప్పారు. ఎందుకంటే మహేష్ చెప్పిన పాయింట్ భలేగా వుంది. తన అభిమానులు కూడా తన సినిమా బాగుంటేనే చూస్తారట. బాగులేకుంటే ఫ్యాన్స్ అయినా చూడరట.
బహుశా బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ మహేష్ బాబును ఈ అభిప్రాయానికి వచ్చేలా చేసి వుండొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ సంఖ్య తక్కువేమీ కాదు. వారంతా చూస్తే చాలు సినిమా ఏవరేజ్ అవుతుంది. అదే వాళ్లు రిపీట్ గా చూస్తే హిట్ అయికూర్చుంటుంది.
అలాంటిది బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాపులు వచ్చాయి అంటే అభిమానులు సైతం సినిమాకు దూరంగా వున్నారన్నదే మహేష్ ఫీలింగ్ కావచ్చు. అందుకే ఇప్పడు అలా అని వుండొచ్చు. స్పైడర్ సభలో మహేష్ మాట్లాడుతూ, తన ఫ్యాన్స్ ఇకపై ఇలాగే వుండాలని కోరారు. కానీ దాని వెనుక నిజంగా అదే ఉద్దేశం వుందా? లేక ఫ్యాన్స్ కాబట్టి, తన సినిమాను కచ్చితంగా చూడాలని, మిగిలిన హీరోల ఫ్యాన్స్ లను చూసి, తన ఫ్యాన్స్ మారాలని ఇండైరెక్ట్ గా కోరారని అనుకోవాలా?
అవును, తన ఫ్యాన్స్ గురించి తను చెప్పడం బాగానే వుంది. కానీ మిగిలిన ఏ హీరోకు ఇలాంటి ఫ్యాన్స్ వుండరని మహేష్ చెప్పడం భలేగా వుంది. అంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్ వాళ్ల హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా చూసేస్తారని చెప్పడం ఏమిటి? వాళ్లు మాత్రం చూస్తున్నారో? లేదో? మహేష్ ఎలా డిసైడ్ చేస్తారు?