భలే మంచి రోజు, శమంతకమణి లాంటి చిన్న సినిమాలతో కాస్త విషయం వున్న డైరక్టరే అనిపించుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు అతగాడిని అదృష్టం వరించేలాగే వుంది. కింగ్ నాగార్జున, నాని లతో కలిసి ఓ మల్టీస్టారర్ డైరక్ట్ చేసే అవకాశం వస్తున్నట్లు కనిపిస్తోంది. అశ్వనీదత్ నిర్మాతగా నాగ్, నానిలతో శ్రీరామ్ ఆదిత్య ఓ సినిమా త్వరలో స్టార్ట్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈ మేరకు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన ఓ లైన్ ను నిర్మాత అటు నాగ్, ఇటు నానిల దృష్టికి తీసుకెళ్లగా ఓకె అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ చేతిలో ఓకె చేసిన ప్రాజెక్టు ఏదీ లేదు. రాజుగారి గది 2 పూర్తయిపోయింది. అందువల్ల అశ్వనీదత్ తెచ్చిన స్క్రిప్ట్ నచ్చితే నాగ్ రెడీ. కానీ నాని మాత్రం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఏది ముందు, ఏది వెనుక అన్నది ఇంకా సరిగ్గా ఫిక్స్ కాలేదు. అందువల్ల మరి ఇప్పుడు చేస్తున్న ఎంసిఎ తరువాత ఈ సినిమా స్టార్ట్ చేస్తాడా? అన్నది చూడాలి.
ఈ సినిమా కనుక ఫిక్స్ అయి, స్టార్ట్ అయితే శ్రీరామ్ ఆదిత్యకు కెరీర్ సూపర్ టర్నింగ్ తీసుకున్నట్లే అవుతుంది.