నాగ్, నానిలతో శ్రీరామ్ ఆదిత్య

భలే మంచి రోజు, శమంతకమణి లాంటి చిన్న సినిమాలతో కాస్త విషయం వున్న డైరక్టరే అనిపించుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు అతగాడిని అదృష్టం వరించేలాగే వుంది. కింగ్ నాగార్జున, నాని లతో కలిసి ఓ…

భలే మంచి రోజు, శమంతకమణి లాంటి చిన్న సినిమాలతో కాస్త విషయం వున్న డైరక్టరే అనిపించుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు అతగాడిని అదృష్టం వరించేలాగే వుంది. కింగ్ నాగార్జున, నాని లతో కలిసి ఓ మల్టీస్టారర్ డైరక్ట్ చేసే అవకాశం వస్తున్నట్లు కనిపిస్తోంది. అశ్వనీదత్ నిర్మాతగా నాగ్, నానిలతో శ్రీరామ్ ఆదిత్య ఓ సినిమా త్వరలో స్టార్ట్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈ మేరకు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన ఓ లైన్ ను నిర్మాత అటు నాగ్, ఇటు నానిల దృష్టికి తీసుకెళ్లగా ఓకె అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ చేతిలో ఓకె చేసిన ప్రాజెక్టు ఏదీ లేదు. రాజుగారి గది 2 పూర్తయిపోయింది. అందువల్ల అశ్వనీదత్ తెచ్చిన స్క్రిప్ట్ నచ్చితే నాగ్ రెడీ. కానీ నాని మాత్రం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఏది ముందు, ఏది వెనుక అన్నది ఇంకా సరిగ్గా ఫిక్స్ కాలేదు. అందువల్ల మరి ఇప్పుడు చేస్తున్న ఎంసిఎ తరువాత ఈ సినిమా స్టార్ట్ చేస్తాడా? అన్నది చూడాలి.

ఈ సినిమా కనుక ఫిక్స్ అయి, స్టార్ట్ అయితే శ్రీరామ్ ఆదిత్యకు కెరీర్ సూపర్ టర్నింగ్ తీసుకున్నట్లే అవుతుంది.