Advertisement


Home > Movies - Movie Gossip
టాలీవుడ్ సీతమ్మ.. స్లిమ్ అండ్ సెక్సీ

అంజలి పేరు చెప్పగానే ఓ బొద్దు పర్సనాలిటీ, లంగాఓణీ, చీరలు గుర్తొస్తాయి. కేవలం సీనియర్ హీరోలకు మాత్రమే సూట్ అవుతుందనే ట్యాగ్ లైన్ వచ్చేసిందామెకు. ఎందుకంటే ఆమె ఫిజిక్ అలాంటిది. ఇందులో భాగంగా వెంకటేశ్, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేసిన అంజలి.. తెలుగులో యంగ్ హీరోస్ కు దాదాపు దూరమైంది.

అయితే ఇదంతా గతం. ఇప్పుడు అంజలి ఒకప్పటి సీతమ్మలా లేదు. స్లిమ్ ఫిజిక్ తో సెక్సీగా తయారైంది. పెరిగిన బరువును కొన్ని నెలలుగా తగ్గించే పనిలో ఉన్న అంజలి ఎట్టకేలకు తన స్లిమ్ స్టిల్స్ ను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు "వావ్ అంజలి" అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

నిజమే.. అంజలి భలే స్లిమ్ అయింది. అందరూ షాకయ్యేలా తయారైంది. ఈసారి టాలీవుడ్ యంగ్ హీరోస్ ఆమెకు అవకాశాలిస్తారేమో చూడాలి. కోలీవుడ్ లో మాత్రం ఫిజిక్ తో సంబంధం లేకుండా ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.