టీవీ షో దిశగా వెంకీ ఆలోచన?

టీవీ షో లు అంటే చిన్న చూపు ఇప్పుడు మారిపోయింది. సినిమాల్లో ఖాళీ అయిన వారు, రిటైర్ అయిన వారే టీవీకి వెళ్తారన్న ఆలోచన మారిపోయింది. నాగ్ చూపిన బాటలో చిరంజీవి, ఆపై ఎన్టీఆర్…

టీవీ షో లు అంటే చిన్న చూపు ఇప్పుడు మారిపోయింది. సినిమాల్లో ఖాళీ అయిన వారు, రిటైర్ అయిన వారే టీవీకి వెళ్తారన్న ఆలోచన మారిపోయింది. నాగ్ చూపిన బాటలో చిరంజీవి, ఆపై ఎన్టీఆర్ కూడా దూసుకుపోయారు. స్మాల్ స్క్రీన్ పై ఎన్టీఆర్ బిగి బాస్ పేరుతో, రానా నెంబర్ వన్ యారీ పేరుతో సాధిస్తున్న విజయాలు నమోదు చేయదగ్గవే. 

అందుకే విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు చిన్న తెరమీదకు రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కండిషన్ ఒక్కటే. సరైన షో అయిడియా వుండాలి. అలాంటి మాంచి షో వుంటే చిన్న తెరపైకి వెంకీ రావడం అన్నది జరగని పని కాదు అని తెలుస్తోంది.

ఇప్పటికే కొందరు చిన్న తెరపైకి వెంకీని తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే స్మాల్ స్క్రీన్ పైకి తాను రావాలంటే, అందుకు తగిన సరైన అయిడియా, ప్లాట్ ఫారమ్ అవసరం అని వెంకీ అభిప్రాయపడినట్ల తెలుస్తోంది. 

మరి అలాంటి షో అయిడియాను ఎవరు రెడీ చేసి, వెంకీ ని తమ ఫోల్డ్ లోకి తీసుకుని, చిన్న తెరపైకి తీసుకువస్తారో చూడాలి.