ఈ దెబ్బతో శ్రీకాంత్ జాతకం తెలిసిపోతుంది

హీరోలుగా ఇన్నింగ్స్ ముగిసినా, లేదా హీరోలుగా రాణించలేకపోయినా విలన్ దారి పట్టడం అన్నది కామన్. చాలా మంది అలా సక్సెస్ అయి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రోజులు వున్నాయి. బోయపాటి పుణ్యమా అని…

హీరోలుగా ఇన్నింగ్స్ ముగిసినా, లేదా హీరోలుగా రాణించలేకపోయినా విలన్ దారి పట్టడం అన్నది కామన్. చాలా మంది అలా సక్సెస్ అయి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రోజులు వున్నాయి. బోయపాటి పుణ్యమా అని జగపతి బాబు సుడి తిరిగింది. అలాగే ఆది పినిశెట్టికి తెలుగులో వైవిధ్యమైన పాత్రలు దొరుకుతున్నాయి. తనీష్ ట్రయ్ చేసినా లక్ కలిసిరాలేదు. సుమన్ ఒకసారి చేసి క్లిక్ అయ్యాడు కానీ ఆఫర్లు పెద్దగా రాలేదు మళ్లీ. 

అయితే హీరో శ్రీకాంత్ వైనం అలాంటిది కాదు. రివర్స్ కేసు. విలన్ గా వచ్చి హీరోగా మారిన వైనం. కానీ విలన్ నుంచి హీరోగా మారిన మోహన్ బాబు, గోపీచంద్ లాంటి వాళ్లు మళ్లీ వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అయితే శ్రీకాంత్ కు మాత్రం ఇప్పుడు టైమ్ కలిసి రావడం లేదు. హీరో వేషాలకు సూట్ కావడం లేదు. యంగ్ హీరోలకు ఎక్కువ, ముదురు హీరోలకు తక్కువ అన్నట్లు వుంది పరిస్థితి. అలా అని క్యారెక్టర్లు ట్రయ్ చేస్తుంటే కుదరడం లేదు.

అందుకే ఇప్పుడు విలన్ దారి పడుతున్నాడు. యుద్ధం శరణంలో పూర్తి స్థాయి విలన్ గా మాత్రమే కాదు. తన బబ్లీ ఫేస్ ను భయంకరంగా మార్చుకుని మరీ ట్రయ్ చేస్తున్నాడు. నిజానికి ఇలా భయంకరమైన ఫేస్ విలనీకి మనకు అక్కరలేదు. సాఫ్ట్ ఫేస్ విలనీనే మనవాళ్లు లైక్ చేస్తారు. కానీ శ్రీకాంత్ డిఫరెంట్ గా ట్రయ్ చేస్తున్నట్లుంది. చూడాలి ఎలా పండుతుందో? ఈ సినిమా క్లిక్ అయి, శ్రీకాంత్ కు పేరు వస్తే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. లేదూ అంటే ఇక శ్రీకాంత్ కెరీర్ జంక్షన్ లో నిలిచిపోతుంది.