మోక్షజ్ఞ ప్రేమకథ?

మోక్షజ్ఞ తెరంగ్రేటం అన్నది ఇప్పుడు కొత్తగా ఫిక్సయింది కాదు. గడచిన కొన్నాళ్లుగా తరచు వినిపిస్తున్నదే. ఇంకా కాస్త టైమ వుంది అంటూ బాలయ్య ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు 2018 అని అంటూ టైమ్ చెప్పారంతే.…

మోక్షజ్ఞ తెరంగ్రేటం అన్నది ఇప్పుడు కొత్తగా ఫిక్సయింది కాదు. గడచిన కొన్నాళ్లుగా తరచు వినిపిస్తున్నదే. ఇంకా కాస్త టైమ వుంది అంటూ బాలయ్య ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు 2018 అని అంటూ టైమ్ చెప్పారంతే. ఈ టైమ్ చెప్పడానికి ఏడాది ముందే, గౌతమీ పుత్ర శాతకర్ణి టైమ్ లోనే డైరక్టర్ క్రిష్ ఒక సబ్జెక్ట్ చెప్పడం, దాన్ని బాలయ్య ఓకె చేయడం, అప్పటి నుంచీ క్రిష్ ఆ పని మీద వుండడం జరిగిపోయింది. 

అయితే ఫస్ట్ సినిమా చేసే లెవెల్ కు వుండేలా క్రిష్ చెప్పిన సబ్జెక్ట్ ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా వుంది. ఎందుకంటే బాలయ్య తన కొడుకుతో స్లో అండ్ స్టడీగా మంచి సినిమాలు చేయిస్తూ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని వుంది. ఆ విషయం ఎన్నో సార్లు సన్నిహితుల దగ్గర వెల్లడించారు. మంచి మంచి డైరక్టర్లతో మంచి సినిమాలు చేయించాలన్నది తన ఆలోచనగా ఆయన వెల్లడించారు.

అయితే క్రిష్ మరీ ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్ లు తయారుచేసే డైరక్టర్ కాదు. కానీ మంచి స్క్రిప్ట్ లు, నటులకు పేరు తెచ్చే స్క్రిప్ట్ లు తయారు చేస్తారాయిన. ఎప్పటి నుంచో మాంచి ప్రేమ కథ తెరకెక్కించాలన్న సంకల్పం క్రిష్ కు వుంది. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ లో ఆ జోనర్ ఇంతవరకు ఆయన ట్రయ్ చేయలేదు. అది ఆయన కోరిక.

గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి ఇలా చేసిన జోనర్ చేయకుండా వస్తున్న క్రిష్ ఈ సారి లవ్ జోనర్ ను తలకెత్తుకుంటున్నారు. అయితే ఇది ఈకాలం ఫాస్ట్ లవ్ మాదిరిగా కాకుండా, ఫీల్ లవ్ అనే టైపు సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ కు మ్యూజిక్ కూడా కీలకంగా వుంటుందని వినికిడి. ప్రేమ వివాహం చేసుకుని, ప్రేమలో మునిగి తేలిన క్రిష్ ప్రేమ సబ్జెక్ట్ ను తెరపై ఎంత బాగా పండిస్తారో చూడాలి మరి.