డైరక్టర్ ఎస్ జె సూర్యను విలన్ గా పరిచయం చేస్తున్నాడు దర్శకుడు మురుగదాస్ తన స్పైడర్ సినిమాతో. స్పైడర్ సినిమా టీజర్ లో సూర్య క్యారెక్టర్ చెప్పిన డైలాగులు అతని గొంతుతో వచ్చినవే.
కానీ అంతలోనే ఏమయిందో. డబ్బింగ్ వేళకు మాత్రం ఎస్ జె సూర్యను పక్కన పెట్టారు. టోటల్ డబ్బింగ్ అంతా 'సాయి రవి' చెప్పారు. సాయి రవి అంటే ఎవరో కాదు, వదల బొమ్మాళీ.. వదల అంటూ జనాల్ని తన గొంతుతో భయపెట్టిన వాడే.
టీజర్ లో ఎస్ జె సూర్య స్వరం విని, అంత గొప్పగా లేదని, తెలుగు ఆఢియన్స్ కు ఆ టోన్ విలనిజానికి సరిపోదని యూనిట్ ఫీలయినట్లు బోగట్టా. అందుకే అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకుని 'సాయిరవి'తో డబ్బింగ్ చెప్పించారు.
మరో కొద్ది రోజుల్లో బయటకు రాబోయే ట్రయిలర్ లో విలన్ కు వినిపించే గొంతు సాయి రవిదే. అయితే తమిళంలో మాత్రం ఎస్ జె సూర్య గొంతే వినిపిస్తుంది. ఎస్ జె సూర్యకు సాయి రవి గొంతు తోడై విలనిజం పండితే, తెలుగు జనాలకు కొత్త విలన్ దొరికినట్లే.