నటి పూనమ్ కౌర్ ఆదివారం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఎందుకనో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులకు విపరీతమైన కోపం తెప్పించింది. పూనమ్‌పై లం…భాషలో విరుచుకుపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతగా కోపం తెప్పించిన ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం. పవన్ ఫ్యాన్స్ గుక్కపెట్టి ఏడుస్తున్నారే
“స్త్రీల సమస్యలపై మహా శ్రధ్ధ ఉన్నట్టు గొంతు చించుకుని అరుస్తున్న వీళ్ళు మహిళా రెజ్లర్ల కష్టాల గురించి ఒక్క మాటైనా మాట్లాడ లేదు. వాళ్ల స్వలాభం, సౌకర్యాలే ప్రధానమైన కుహనా నాయకులతో జాగ్రత్త గా ఉండండి” అంటూ పూనమ్ కౌర్ హెచ్చరికతో కూడిన ట్వీట్ చేశారు. దీనికి తోడు ఆమె హ్యాష్‌ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రత్యేకంగా పేర్కొనడంతో ఆ రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ఉందని చెప్పాల్సిన పనిలేదు.
ఇటీవల వారాహి యాత్ర పేరుతో జనసేనాని పవన్‌కల్యాణ్ జనంలోకి వెళ్లారు. ఈయన గారే మహిళల ఉద్ధారకుడిగా చెప్పుకుంటున్నారు. ఇటీవల వాలంటీర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒంటరి మహిళలు, వితంతువులను గుర్తించి అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణ కూడా చేశారు. ఈ విషయాన్ని తనకు కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని పవన్ నమ్మించే ప్రయత్నం చేశారు. మహిళల కేంద్రంగా పవన్‌కల్యాణే చాలా ఎక్కువ మాట్లాడారు.
ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ట్వీట్ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక నాయకుడి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేందుకే పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సదరు నాయకుడి గురించి తనకు మాత్రమే తెలిసిన చీకటి రహస్యాలేవో జనానికి చెప్పాలనే తాపత్రయం ఆమె ట్వీట్లో కనిపించింది.
అయితే పేరు చెప్పకుండానే, సదరు నాయకుడు మహిళల విషయంలో వ్యవహరించే తీరును అర్థమయ్యేలా భావోద్వేగం నిండిన హృదయంతో ఆవిష్కరణ చేయడం విశేషం. అయితే జనసేన, పవన్ అభిమానులు మాత్రమే గుక్కపెట్టి ఏడుస్తున్నారు. పూనమ్‌పై దారుణమైన కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.