చెన్నయ్ లో స్పైడర్ ఆడియో

మరో నాలుగు వారాల్లో మహేష్ బాబు-మురుగదాస్ సినిమా స్పైడర్ విడుదల కాబోతోంది. ఇక ఇప్పటి నుంచీ ఈ సినిమా విడుదల పనులకు శ్రీకారం చుట్టే పని ప్రారంభించేసారు. సినిమా విడుదలకు ముందు జరిగే కీలకమైన…

మరో నాలుగు వారాల్లో మహేష్ బాబు-మురుగదాస్ సినిమా స్పైడర్ విడుదల కాబోతోంది. ఇక ఇప్పటి నుంచీ ఈ సినిమా విడుదల పనులకు శ్రీకారం చుట్టే పని ప్రారంభించేసారు. సినిమా విడుదలకు ముందు జరిగే కీలకమైన ఆడియో ఫంక్షన్ ను తొమ్మిదిన చెన్నయ్ లో చేస్తారని తెలుస్తోంది.

స్పైడర్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో సమాంతరంగా నిర్మించిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాతో మహేష్ బాబు తొలిసారి స్ట్రయిట్ తమిళ సినిమా చేస్తున్నారు. అందుకే స్పైడర్ ఆడియో ఫంక్షన్ ను చెన్నయ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకే వేదికపై తెలుగు, తమిళ అడియోలను విడుదల చేస్తారు. తెలుగు, తమిళ సినిమా ప్రముఖులను అతిధులుగా ఆహ్వానిస్తారు.

ఇదిలా వుంటే అడియో ఫంక్షన్ చెన్నయ్ లో జరుపుతున్నందున, విడుదల ముందు ఈ మధ్య ప్రతి సినిమాకు చేస్తున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో రెండో వారం చివరిలో జరుపుతారు. బహుశా 16 లేదా 17 తేదీల్లో అది వుండే అవకాశం వుంది.

ఈ రెండు ఫంక్షన్లు కాక ఫస్ట్ తేదీ నుంచి 20వ తేదీ లోపు వివిధ ఈవెంట్ లు ఆన్ లైన్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ తేదీల్లోనే ఎప్పుడో అప్పడు టోటల్ యూనిట్ ఒకేసారి మీడియాతో ముచ్చటించే అవకాశం కూడా వుంది.