అరకోటికి పైనే అన్నా సై అనని తమన్నా?

అయిటమ్ సాంగ్ కు హీరోయిన్లు సై అనేది రెండు కారణాలతో జరుగుతుంది. అయితే తరువాతి సినిమాలో అదే హీరో పక్కన హీరోయిన్ చాన్స్ ఇస్తామని హామీ ఇవ్వడం. లేదా కాస్త భారీ రెమ్యూనిరేషన్ ఆపర్…

అయిటమ్ సాంగ్ కు హీరోయిన్లు సై అనేది రెండు కారణాలతో జరుగుతుంది. అయితే తరువాతి సినిమాలో అదే హీరో పక్కన హీరోయిన్ చాన్స్ ఇస్తామని హామీ ఇవ్వడం. లేదా కాస్త భారీ రెమ్యూనిరేషన్ ఆపర్ చేయడం.

ఇప్పటికే రెండు మూడు సార్లు అయిటమ్ గర్ల్ అవతారం ఎత్తిన తమన్నా ను జై లవకుశ సినిమా కోసం అడుగుతున్నారు. ఇంకా డిస్కషన్ లో వుందీ వ్యవహారం. ఒక్క సాంగ్ కోసం యాభై లక్షలకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తమన్నాను ఎన్టీఆర్ క్యాంప్ లో కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు ఓకె అనిపించారు. అందుకు గాను తమన్నాకు కోటి ఇరవై లక్షల రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసారు. పైగా జీఎస్టీ అదనం. అంటే ఓ సినిమా మొత్తం నటిస్తే వచ్చే అమౌంట్ లో సగం ఒక్క అయిటమ్ సాంగ్ కే వచ్చేస్తుంది. అయినా ఇంకా తమన్నా ఊ..ఆ అనడం లేదట. మరి ఆమె మనసులో ఏముందో? ఈ మధ్య తెలుగులో హీరోయిన్లకు డిమాండ్ పెరిగిపోయింది.

తమన్నా, కాజల్ లాంటి కాస్త సీనియారిటీ వున్న హీరోయిన్లు కోటికి పైగానే పలుకుతున్నారు. రకుల్ లాంటి యంగ్ టాప్ హీరోయిన్లు ఆ రేంజ్ లోనే వున్నారు. యంగ్ హీరోలు ఇరవై మంది వరకు తెలుగులో వుండడం, ఆపైన మీడియం, బడా హీరోలు మరో పది మంది వరకు వుండడంతో హీరోయిన్లకు డిమాండ్ ఒక లెక్కలో వుంది మరి.