బాహుబలి తరువాత దర్శక దిగ్గజం రాజమౌళి ప్రాజెక్టు ఏమిటి? ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే రాజమౌళి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సబ్జెక్ట్ డిస్కషన్లలో బిజీగా వుందని తెలుస్తోంది.
ఈసారి ప్రాజెక్టులో కూడా ఇద్దరు హీరోలు పాలుపంచుకునే అవకాశం వుందని టాక్. ఆ ఇద్దరు హీరోలు తెలుగు, తమిళ భాషల నుంచి కానీ, టాలీవుడ్ బాలీవుడ్ ల నుంచి కానీ వుండే అవకాశం వుందని వినికిడి. కానీ ఎవరు ఫైనల్ అయ్యే సూచనలు వున్నాయన్నదే ఇంకా తెలియడం లేదు.
అయితే జై లవకుశ సినిమా విడుదలకు రాజమౌళి తరువాతి సినిమా అప్ డేట్స్ కు లింక్ వుందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. జై లవకుశ రిజల్ట్ చూసిన తరువాత రాజమౌళి తన డెసిషన్ ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్లస్ వన్ అదర్ లాంగ్వేజ్ స్టార్ అయితే ఎలా వుంటదన్నది రాజమౌళి అండ్ కో ఆలోచనగా వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అన్నది తెలియకున్నా, ఇండస్ట్రీలో వున్నగ్యాసిప్ ఇది. అయితే ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్ ఫిక్స్ అయిన తరువాతే రాజమౌళి తన ఆలోచనలకు ఓ రూపం తెస్తారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బొగట్టా.