సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో లైమ్ లైట్ లోకి వచ్చేసాడు డైరక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ. ఆ తరువాత సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్ లోనే అది కూడా నాగ్ హీరోగానే అని అప్పట్లో వినిపించింది.
అయితే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫైనల్ కట్ చూసిన తరువాత కళ్యాణ్ పై ఇంప్రెషన్ పోయిందని, నాగ్ నే స్వయంగా ఆ సినిమాను దగ్గరుండి ఎడిట్ చేయించుకుని, ఒకటి రెండు సీన్లు అప్పటికప్పుడు ఏడ్ చేయించాడని ఆ తరువాత టాక్ వినిపించింది. దీంతో మొత్తం మీద రారండోయ్ సినిమా వచ్చి ఇన్నాళ్లయినా, మళ్లీ కళ్యాణ్ కృష్ణ పేరు వినిపించలేదు.
నాగ్ బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. అప్పుడు జనాలు అడిగారు బంగార్రాజు సినిమా ఏమయిందని. నాగ్ కు మొహమాటం లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. అందుకే ఆ క్యారెక్టర్ కు తగిన కథ దొరకాలి.
కళ్యాణ్ ఓ లైన్ చెప్పాడు కానీ నాకు నచ్చలేదు అని కుండ బద్దలుకొట్టేసాడు. కళ్యాణ్ మంచి కథ తెస్తే అప్పుడు చూద్దాం అని తేల్చేసాడు. అంటే ఇక బంగార్రాజు కానీ, కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు కానీ, ఇఫ్పట్లో లేనట్లే అన్నమాట.