సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ 25వ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని నిర్మాణ సంస్థ హారిక-హాసిని క్రియేషన్స్ కొన్ని రోజుల కిందట గ్రాండ్ గా ప్రకటించింది. అలా ఎనౌన్స్ చేసిన కొన్ని గంటలకే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ పోస్ట్ ను తొలిగించింది.
ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ పోస్ట్ తీసేశారని అంతా అనుకున్నారు. కానీ పవన్ పుట్టినరోజు నాడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇష్టంలేకనే పోస్ట్ తొలిగించారని తాజాగా తెలుస్తోంది.
పవన్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ ను పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేస్తే, ఇక అక్కడ్నుంచి దశలవారీగా ఏదో ఒక స్టఫ్ ను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి లాంగ్ గ్యాప్ ఇస్తే సినిమాపై నెగెటివ్ ఒపీనియర్ ప్రారంభమౌతుంది.
సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావాలనేది ప్లాన్. అంటే ఇంకా 4 నెలలు టైం ఉంది. కాబట్టి ప్రమోషన్ ను కాస్త నిదానంగా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ రిలీజ్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. టైటిల్ ను కూడా ప్రకటించకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది.
కనీసం టైటిల్ కూడా ప్రకటించకుండా ఇంతలా నాన్చడం అవసరమా అనేది చాలామంది అభిప్రాయం. ఈ విషయంలో ఫ్యాన్స్, ప్రేక్షకుల అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకునే స్థాయిలో మేకర్స్ లేరు. ఎందుకంటే పేరు కూడా పెట్టకపోయినా సినిమాకు బ్రహ్మాండంగా మార్కెట్ జరిగిపోతోంది. కాబట్టి అంతా వాళ్లిష్టం. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.