ఎన్టీఆర్-త్రివిక్రమ్.. ఎప్పుడు స్టార్ట్?

లవకుశ సినిమా చకచకా ఫినిష్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ అయితే, పవన్ సినిమాను అక్టోబర్ ఆఖరుకు ఎలాగైనా ఫినిష్ చేసే సంకల్పంతో వున్నాడు. మరి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో…

లవకుశ సినిమా చకచకా ఫినిష్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ అయితే, పవన్ సినిమాను అక్టోబర్ ఆఖరుకు ఎలాగైనా ఫినిష్ చేసే సంకల్పంతో వున్నాడు. మరి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో సినిమా ఎప్పుడు? దానికి కూడా ముహుర్తం కుదిరిపోయినట్లు తెలుస్తోంది. 

నవంబర్ 1 లేదా 2వ తేదీల్లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ స్వంత సంస్థ లాంటి హారిక హాసిని బ్యానర్ పైనే ఈ సినిమా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముహర్తం మామూలుగా ఆఫీసులో చేసుకుని లాంఛనమైన ఓపెనింగ్ ను నవంబర్ 1 లేదా 2న చేస్తారని తెలుస్తోంది.

అప్పటి నుంచి ఒక పక్క పవన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూనే ఎన్టీఆర్ సినిమాను కూడా పట్టాలెక్కిస్తారట. ఎన్టీఆర్ సినిమాకు త్రివిక్రమ్ దగ్గర పూర్తి స్క్రిప్ట్ రెడీగా వుండడం వల్ల ఇది సాధ్యమవుతోందని తెలుస్తోంది.