జయ జానకి నిర్మాత గట్టెక్కేసారు

ముక్కోణపు పోటీలో ఈ నెల 11న విడుదలయింది బోయపాటి శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమా. పైగా మూడు సినిమాల్లో కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదే. నిర్మాత గట్టెక్కుతారా? ఎక్కరా? అన్న గుసగుసలు…

ముక్కోణపు పోటీలో ఈ నెల 11న విడుదలయింది బోయపాటి శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమా. పైగా మూడు సినిమాల్లో కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదే. నిర్మాత గట్టెక్కుతారా? ఎక్కరా? అన్న గుసగుసలు వినిపించాయి.

ఎందుకంటే 36కోట్లు ప్రొడక్షన్ కాస్ట్, మరో ఆరు కోట్ల వరకు అదనపు ఖర్చులు కలిసి 43కోట్లు అయింది ఈ సినిమాకు. వాస్తవానికి మంచి బిజినెస్ చేసినా, చివరి నిమిషంలో బయ్యర్లు కాస్త తక్కువ కట్టడంతో, మొత్తం మీద శాటిలైట్ తో కలిసి 41కోట్ల మేరకే రికవరీ అయింది. 

అయితే నిర్మాతలు కర్ణాటకతో సహా మరో ఒకటి రెండు ఏరియాలు వుంచుకోవడంతో, ఆ మేరకు భర్తీ అయిపోయిందట. ఇప్పుడు తమిళ, మళయాల డబ్బింగ్ అండ్ రీమేక్ రైట్స్ అంటూ మరో కోటి కి పైగా ఆఫర్ వస్తోందట. సో మొత్తం మీద నిర్మాత రికవరీ అయిపోయినట్లే.

కానీ ఇదే సమయంలో బయర్ల రికవరీ మాత్రం ఇంకా మిగిలి వుంది. ఇప్పటి దాకా వున్నట్లే, ఈవారం కూడా కాస్త మంచి షేర్ ఫిగర్లు వస్తే, బయ్యర్ల బ్రేక్ ఈవెన్ కావడానికి అవకాశం వుంది. అయితే సీడెడ్, ఉత్తరాంధ్ర లాంటి ఏరియాలు మాత్రం వెనకబడే వుంటాయని వినికిడి. నైజాం కమిషన్, ఖర్చుల సంగతి అలా వుంచి పెట్టిన డబ్బులు వచ్చేస్తాయంటున్నారు.

ఈవారం వివేకం విడుదలయింది. కానీ ఫ్యామిలీ సినిమా కాదని తేలిపోయింది. అర్జున్ రెడ్డి యూత్ సినిమా, పైగా ఎ సర్టిఫికెట్. అందువల్ల జయ జానకీ నాయక ఈ వారం కలెక్షన్ల మీద కూడా ఆశ పెట్టుకుంది. చవితి, శని, ఆదివారాలు కలిసి జయ జానకి బయర్లను గట్టెక్కిస్తాయోమో చూడాలి.