చరణ్ ముంగిట్లో శ్రీనివాస కళ్యాణం

ఈ ఏడాది శతమానం భవతితో హిట్ లకు శ్రీకారం చుట్టారు నిర్మాత దిల్ రాజు. ఆ సినిమా సక్సెస్ ఊపులోనే శ్రీనివాస కళ్యాణం టైటిల్ రిజిస్టర్ చేయించేసారు. శతమానం భవతి సినిమా అందించిన శతీష్…

ఈ ఏడాది శతమానం భవతితో హిట్ లకు శ్రీకారం చుట్టారు నిర్మాత దిల్ రాజు. ఆ సినిమా సక్సెస్ ఊపులోనే శ్రీనివాస కళ్యాణం టైటిల్ రిజిస్టర్ చేయించేసారు. శతమానం భవతి సినిమా అందించిన శతీష్ వేగ్నిశ దానికి దర్శకుడు. మాంచి కథ అయితే రెడీ. అయితే కథానాయకుడు ఎవరు? ఈ సినిమాను కాస్త పెద్ద స్కేల్ లో తీయాలన్నది దిల్ రాజు సంకల్పం. అందుకని ఇప్పటికే ఆ స్క్రిప్ట్ ను ముగ్గురు టాప్ హీరోలకు వినిపింప చేసారట. 

ముగ్గురిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాల తరువాత మళ్లీ మరోసారి మరీ టూ క్లాస్ సినిమాలు చేసే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయన దిల్ రాజుకు క్లియర్ గా చెప్పేసినట్లు తెలుస్తోంది.

రెండో హీరో ఎన్టీఆర్. రెండు కమిట్ మెంట్లు ఫిక్సయిపోయి వున్నాయి. ఒకటి త్రివిక్రమ్, రెండోది కొరటాల శివ. పైగా ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టు డిస్కషన్ లో వుండనే వుంది.

సో, మిగిలిన మూడో హీరో రామ్ చరణ్. ఎలాగైనా చరణ్ ను ఒప్పించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్ ఓకె అంటారా? ఇప్పటికే రంగస్థలం అంటూ ఓ క్లాస్ సినిమా చేస్తున్న చరణ్ ఆ తరువాత అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో వున్నట్లు వినికిడి. మరి ఈ ప్రపోజల్ కు ఏమంటారో? మరి అక్కడ నో అన్న ఆన్సర్ వస్తే, శ్రీనివాస కళ్యాణానికి ఎవరు వస్తారో?