డిఫరెంట్ డైరక్టర్ సుకుమార్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా మొన్న దసరాకు రావాల్సిన సినిమా. అయితే డైరక్టర్ సుకుమార్ స్లో అండ్ స్టడీ స్టయిల్ తెలిసిందే కదా? అక్కడి నుంచి ఒకే ఒక లాంగ్ జంప్ సంక్రాంతికి అంటూ గెంతేసింది. అబ్బాయ్ రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి రుమాలు వేసిందని తెలిసి కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా కూడా సంక్రాంతికే అంటూ సైలెంట్ గా డేట్ ఇచ్చేసారు.
సో, అప్పుడే అనుకున్నారు, రంగస్థలం ముందుకో వెనక్కో జరగక తప్పదని. అయితే డిసెంబర్ నెలాఖరులో రావచ్చు అన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ గా ఇండస్ట్రీ సర్కిళ్లలో కొత్త వార్త గుప్పు మంది. రంగస్థలం ఏకంగా ఏప్రిల్ 20కి వెళ్లిపోయిందన్నది ఆ వార్త. డిసెంబర్ ఆఖరు వారంలో వేసినా, అనుకున్నట్లు సంక్రాంతి డేట్ కే వచ్చినా, ఆ వెంటనే వారం తిరగకుండానే భారీ సినిమాలతో పోటీలో ఇరుక్కోవాల్సి వస్తుంది. అందుకే మరోసారి లాంగ్ జంప్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి.
కానీ మరీ సంక్రాంతి నుంచి ఇంత లాంగ్ జంప్ ఎందుకు చేయాల్సి వచ్చిందా? ఈ గుసగుసలు నిజమేనా? అని ఆరా తీస్తుంటే, సినిమాల పోటీ ఒక్కటే ఈ లాంగ్ జంప్ కు కారణం కాదని వినిపిస్తోంది. సుకుమార్ ఆ మధ్య అంత తన డైరక్టర్ సినిమా విడుదల, ప్రచారం తదితర పనుల్లో బిజీ అయ్యారట. ఆయన ఫ్రీ అయ్యారంటే రామ్ చరణ్ తన సై..రా సినిమా టైటిల్ విడుదల, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారట. ఇలా ఒకళ్లు వస్తే, మరొక్కళ్లు రాక సినిమా డిలే అవుతోందని టాక్ వినిపిస్తోంది. అసలు సుకుమార్ తో సినిమా అంటేనే ఇలా వుంటుందని మొదట్నించీ అనుకుంటున్నదే.
చూడాలి రంగస్థలం ముస్తాబు ఎప్పటికి పూర్తవుతుందో? డిసెంబర్ ఆఖరు, జనవరి లేదు అన్న కచ్చితంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి లాంగ్ జంప్ నిజమై ఏప్రిల్ 20నే విడుదల అన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సి వుంది.ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అదే సంస్థ నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో సవ్యసాచి స్టార్ట్ చేయబోతోంది. ఈ లెక్కన అది కూడా రెడీ అయిపోతుందేమో? ఏప్రిల్ వేళకు.