పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో సినిమా చకచకా ముస్తాబవుతోంది. ఈ సినిమా బిజినెస్ మాత్రం ఇంకా బేరసారాల్లోనే వుండడం విశేషం. దీనికి కారణం మరేం లేదు.
ఆ సినిమా బడ్జెట్ నే. ఆరంభంలో 95 నుంచి 100కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ సెట్ మీద సెట్ కట్టుకుంటూ వెళ్తుంటే అది కాస్తా 120కోట్ల వరకు డేకేస్తోందని తెలుస్తోంది. దీంతో అమ్మకాల రేట్లు కూడా అలాగే చెబుతున్నారట.
ప్రస్తుతం ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఖైదీ 150 వసూలు రేట్ల రేంజ్ లో పవన్ సినిమాకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడిక్కడ బేరాలు అలాగే వున్నాయి కానీ, ఇంకా ఫిక్స్ కావడం లేదు. వాస్తవానికి హారిక హాసిని సంస్థకు ఫిక్స్ డ్ అండ్ పర్మనంట్ బయ్యర్లు వున్నారు.
ఈ సారి కూడా వారే వుంటారని అనుకోవాల్సిందే. ఒక్క ఈస్ట్ మాత్రం మార్పు తప్పదని టాక్. ఎందుకంటే ప్రేమమ్, బాబు బంగారం టైమ్ లో ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణతో హారిక హాసిని సంస్థకు ఏదో తేడా వచ్చింది.
అందువల్ల బయ్యర్లు అయితే రెడీ కానీ, రేట్లు మాత్రం తేలడం లేదు. మరోపక్క డైరక్టర్ త్రివిక్రమ్ కు వున్న క్రేజ్, పవర్ స్టార్ క్రేజ్ ను కలిపి, ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డుల్లో టాప్ న వుంటుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే, తాము అనుకున్న రేట్లు వచ్చేదాకా అలా వుంచుతున్నారు. ఇప్పటి దాకా ఫలానా ఏరియా ఇంత, అంత అనడమే కానీ ఫిక్స్ అయింది కానీ లేదని తెలుస్తోంది. ఆంథ్ర, తెలంగాణ కలిపి 80 – 90కోట్ల రేంజ్ లో అమ్మకాలు సాగించాలన్నది లక్ష్యం అని వదంతులు వినిపిస్తున్నాయి. అంటే ఇధి పవన్ బాహుబలి అన్నమాట.