ఒకప్పుడు తెలుగు నాట డబ్బింగ్ సినిమాల హవా ఓ రేంజ్ లో వుండేది. సూర్య, కార్తీ, అజిత్, సినిమాలు దాదాపు డైరక్ట్ సినిమాల రేంజ్ లో హడావుడి వుండేది. పబ్లిసిటీ పీక్ లో వుండేది. వసూళ్లు కూడా అదే రేంజ్ లో వుండేది. వాటిని బట్టే రేట్లు కూడా వుండేవి. కానీ ఇప్పుడు అది అంతా గతంగా మారిపోయింది.
రజనీ లాంటి సూపర్ స్టార్ నుంచి, సూర్య, అజిత్ ల సినిమాల కారణంగా తెలుగు నిర్మాతలు తిన్న దెబ్బలు ఇన్నీ అన్నీ కావు. కోట్లలో కుదేలయ్యారు. బెల్లంకొండ సురేష్ లాంటి బడా నిర్మాతతో సహా. లింగా, కబాలి, పులి లాంటి సినిమాలు నిర్మాతలను, బయ్యర్లను ముంచేసాయి.
దాంతో ఇప్పుడు తెలుగు నాట తమిళ బడా సినిమాలకు డిమాండ్ అమాంతం పడిపోయింది. జనాలు కూడా ఈ సినిమాల మీద నమ్మకాలు పెట్టుకోవడం మానేసారు. దాంతో తమిళ సినిమాలకు బయ్యర్లే కరువైపోతున్నారు. ప్రతి సినిమా కు ఏవరో కొత్త నిర్మాతల పేర్లు తెరపైకి వస్తున్నాయి తప్ప, స్టాండర్డ్ నిర్మాతలు డబ్బింగ్ సినిమాల జోలికిపోవడం లేదు.
విఐపి 2 సినిమాకు 12కోట్లు రేట్ కోట్ చేస్తే, ఒక్క నిర్మాత అటు చూడలేదు. ఆఖరికి తమిళ నిర్మాతలే నేరుగా ఇక్కడ విడుదల చేసుకుంటున్నారు. అజిత్ వివేగం ను కొత్త నిర్మాతలే కొన్నారు.
ఈ మధ్య రెండే తమిళ ప్రాజెక్టులు కాస్త క్రేజ్ తో వున్నాయి. ఒకటి విజయ్ మెర్సాల్, రెండవది రజనీ రోబో. ఈ రెండు సినిమాల భవిష్యత్ తెలిస్తేనే మళ్లీ డబ్బింగ్ సినిమాల మీద పెద్ద నిర్మాతల దృష్టి పడుతుంది. ఈ రెండు సినిమాలను కూడా గతంలో పవన్ తో మాత్రమే సిన్మాలు నిర్మించిన శరత్ మరార్ తదితరులు టేకోవర్ చేసారు తప్ప, సీనియర్ నిర్మాతలు కాదు.