తెలుగు వాళ్లకి బిగ్ బాస్ షో అటు ఇటు కాకుండా తయారైంది. శని ఆదివారాలు ఎన్టీఆర్ వస్తాడు కాబట్టి ఆ రెండు రోజులు ఆసక్తికరంగానే వుంది. అప్పటికీ మిగిలిన సవాలక్ష సాదా సీదా గేమ్ షోల మాదిరిగా ఆవారం ఏ సినిమా విడుదలయితే, ఆ సినిమా వాళ్లను గెస్ట్ గా తీసుకురావడం అన్నది రానాతో ప్రారంభించారు. ఇప్పుడు తాప్సీ కూడా వచ్చింది.
సరే, మరి ఇంకా ఈ షో డ్రయ్ గానే వుంది కదా? ఎలా రక్తి కట్టించడం. అందుకే నవదీప్ లాంటి డిఫరెంట్ గై ను లోపలకు పంపాలనుకున్నారు. అందుకే మహేష్ కత్తిని బయటకు తెచ్చారు. అంతా యంగ్ బ్యాచ్ వుండాలి. కానీ ఇలా డిప్లమాటిక్ గా వ్యవహరించే పెద్దాయిన లాభంలేదని డిసైడ్ అయి అలా చేసారని అర్థం అయిపోతోంది.
ఇక మిగిలింది ధన్ రాజ్, ప్రిన్స్, శివబాలాజీ, ఆదర్స్, లాంటి సేమ్ యూజ్ గ్రూప్ నే. ఇప్పుడు నవదీప్ చేరాడు. ఇక అసలు రచ్చ స్టార్ట్ అయింది. హరితేజ, కత్తి కార్తీక లాంటి టీవీ నేపథ్యం వున్నవారిని పక్కన పెడితే సినిమా జనాలైన అర్చన, దీక్ష, ముమైత్ ను సీన్ల కోసం వాడుకోవాలని డిసైడ్ అయినట్లుంది. ఇక స్క్రీన్ మీద నానా గత్తర పండించడం ప్రారంభించారు.
మాటీవీ అంటే కాస్త ఫ్యామిలీ టీవీ అనే పేరు వుంది. ఇప్పుడు ఆ పేరు కాస్తా తగలడుతోంది. ఇంట్లో నలుగురు కూర్చుని ఇక బిగ్ బాస్ చూసే పరిస్థితి వుండకపోవచ్చు. అయినా అది చానెల్ జనాలకు అనవసరం. వాళ్లకు కావాల్సింది టీఆర్పీ. అందుకోసం షో ను ఎంత కిందకైనా లాగేస్తారు. అంతా బాగానే వుంది.
కానీ నాగార్జున ఎంత డిగ్నిఫైడ్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు షో రన్ చేసారు. ఎన్టీఆర్ కూడా తన దైన జోవియల్ స్టయిల్ లో షో రన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి వల్గారిటీ పెరిగితే మాత్రం, ఎన్టీఆర్ పేరు కూడా డ్యామేజ్ అవుతుంది. అది గ్యారంటీ.