స్పైడర్‌ చప్పబడిపోయింది

భారీ అంచనాలతో వస్తోన్న సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోను శ్రద్ధ పెట్టాలి. బాహుబలి చిత్రానికి రాజమౌళి ఏ రీతిన బజ్‌ బిల్డ్‌ చేసాడనేది చూసాం కదా. ఆ చిత్రానికి సంబంధించి ప్రతి పోస్టర్‌తోను అంచనాలు…

భారీ అంచనాలతో వస్తోన్న సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోను శ్రద్ధ పెట్టాలి. బాహుబలి చిత్రానికి రాజమౌళి ఏ రీతిన బజ్‌ బిల్డ్‌ చేసాడనేది చూసాం కదా. ఆ చిత్రానికి సంబంధించి ప్రతి పోస్టర్‌తోను అంచనాలు పెరిగేలా జాగ్రత్త పడ్డారు. ఇక ట్రెయిలర్లు అయితే అద్భుతంగా కట్‌ చేసి సినిమా కోసం జనం ఎదురు చూసేలా చేసారు.

ఇదంతా చూసి కూడా 'స్పైడర్‌' చిత్రానికి ఆకర్షణీయమైన టీజర్‌ కట్‌ చేయడంలో మురుగదాస్‌ టీమ్‌ విఫలమైంది. 'స్పైడర్‌' టీజర్‌కి అభిమానుల నుంచి కూడా మిశ్రమ స్పందన రావడాన్ని బట్టే ఇందులో విషయం లేదనేది అర్థమవుతోంది. ఇది సినిమాపై హైప్‌ పెంచేలా కాకుండా అంచనాలు తగ్గించడానికి రిలీజ్‌ చేసిన టీజర్‌లా వుందని కామెంట్లు పడుతున్నాయి.

ఏడాదికి పైగా నిర్మాణంలో వున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. కనీసం విజువల్‌గా అయినా ఆ గ్రాండ్‌నెస్‌ టీజర్‌లో కనిపించలేదు. డల్‌ ఫోటోగ్రఫీ, బ్యాడ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ని మహేష్‌ ఒక్కడూ కప్పిపుచ్చలేకపోయాడు. దానికి తోడు మురుగదాస్‌ ఎంచుకున్న కథ కూడా అతని పాత చిత్రాలని తలపించేలా వుంది. ఈ టీజర్‌ చూసి చాలా మంది 'సెవెన్త్‌ సెన్స్‌' చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి ట్రెయిలర్‌తో అయినా మురుగదాస్‌ టీమ్‌ అంచనాలు పెంచుతారో లేదో చూడాలిక.