బాలయ్య-పూరిజగన్నాధ్ కాంబినేషన్ లోని పైసా వసూల్ సినిమా అమ్మకాల ద్వారా పైసా వసూలు కార్యక్రమంలో బిజీగా వుంది. ఇప్పటికే నైజాంను 8.10కోట్లకు విక్రయించారు. ఇప్పుడు సీడెడ్ ను కూడా విక్రయించారు. 7.02కోట్లకు విక్రయించినట్లు యూనిట్ వర్గాల బోగట్టా. ఇక ఆంధ్ర ఏరియా వుంది. బేరాలు సాగుతున్నాయి.
ఓవర్ సీస్ ను నిర్మాతలు రెండు కోట్లకు కోట్ చేస్తున్నారు. కానీ కొనేవాళ్లు ఆ రేంజ్ కు రావడం లేదు. ఈ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా అన్నీ కలుపుకున్నా, ముఫైకోట్ల కన్నా బిజినెస్ అయ్యేలా కనిపించడం లేదు. సినిమాకు వడ్డీలు, పబ్లిసిటీ వగైరాలు కాకుండా 35కోట్ల మేరకు అయినట్లు తెలుస్తోంది. కానీ యూనిట్ వర్గాలు మాత్రం అన్నీ కలిపి 45కోట్ల వరకు అయిందని చెబుతున్నాయి.
ముఫైఅయిదు కోట్ల మేరకు అయితే, శాటిలైట్ తో కలిపి విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం వుంది. అలా కాకుండా నలభై ఫ్లస్ అయినట్లు అయితే, ఓవర్ ఫ్లోస్ వస్తే తప్ప, బాలయ్య నిర్మాతలు గట్టెక్కరు. పూరి-బాలయ్య క్రేజీ ప్రాజెక్టు అనుకుంటే మరీ ఇంత తక్కువ బిజినెస్ కావడం ఏమిటో?