యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన చేతికి వున్న ఓ ఉంగరం కథను చెప్పాడు. అది కూడా సినిమా టీజర్ లా చిన్నగా వున్నా, చివర్న చురుక్కుమనే ట్విస్ట్ కూడా వుంది. బిగ్ బాస్ షో సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన చేతికి వున్న ఓ ఉంగరం చూపించారు. అది తన భార్య ప్రణతి ఇచ్చినట్లు వెల్లడించాడు.
ఇంతకీ ఆ ఉంగరం స్పెషాలిటీ ఏమిటంటే, ఒకవైపు తన భార్య పేరు, మరో వైపు తన కొడుకు అభిరామ్ పేరు వుంటాయట. అక్కడితే ఆగిపోతే అది టీజర్ లా చురుక్కుమని ఎలా వుంటుంది. ఉంగరం ఇచ్చాక ఎన్టీఆర్ తన భార్యను అడిగాడట. మరి నా పేరు లేదేమిటి? అని. అందుకు ఎన్టీఆర్ భార్య ఇచ్చిన సమాధానమే టీజర్ చివర్న చురుక్కమనే స్టయిల్.
ఇంతకీ ఆ సమాధానం ఏమిటంటే, రెండు పేర్ల మధ్య వున్న చిన్న వజ్రమే ఎన్టీఆర్ అంట. అదిరిందిగా. ధనరాజ్ తన కొడుకు గురించి మాట్లాడినపుడు, ఎమోషన్ అయినపుడు ఎన్టీఆర్ తన నాన్నకు ప్రేమతో సినిమా జ్ఞాపకాలు చెబుతూ ఈ ఉంగరం కథ చెప్పాడు.