పవన్ మీదకు మహేష్ గ్యారంటీనా?

సంక్రాంతికి అందరి కన్నా ముందు రుమాలు వేసింది సూపర్ స్టార్ మహేష్ నే. అతగాడు డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్ లో నటిస్తున్న భరత్ అనే నేను సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుందని అప్పట్లోనే…

సంక్రాంతికి అందరి కన్నా ముందు రుమాలు వేసింది సూపర్ స్టార్ మహేష్ నే. అతగాడు డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్ లో నటిస్తున్న భరత్ అనే నేను సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ రెడీ కావడం కష్టం వార్తలు వినిపించాయి. 

ఇంతలో సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రంగస్థలం సినిమా సంక్రాంతికి వస్తున్నామోచ్, అని ప్రకటించేసింది. ఈ రెండు ఇలా వుండగానే త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా జనవరి 10కి వస్తున్నట్లు పక్కా అయిపోయింది.

బాబాయ్ సినిమా మీదకు చరణ్ రాడు కాబట్టి, సంక్రాంతి బరిలోకి పవన్ సోలోగా వస్తాడని అందరూ అనుకుంటున్నారు.

కానీ పవన్ సినిమా యూనిట్ అలా అనుకోవడం లేదట. మహేష్ సినిమా యూనిట్ కూడా అలా అనడం లేదట. జనవరి 12 కు మహేష్-కొరటాల సినిమా థియేటర్లలోకి వస్తుందనే వీళ్లంతా అంటున్నారు. అదే జరిగితే ఈ సారి సంక్రాంతి మళ్లీ సూపర్ హాట్ గా వుంటుంది.

మొన్నటి సంక్రాంతి చిరు-బాలయ్యల మధ్య కాంపిటీషన్ కు సాక్ష్యంగా నిలిచింది. ఈసారి రాబోయే సంక్రాంతి పవన్-మహేష్ ల మధ్య కాంపిటీషన్ కు సాక్ష్యంగా నిలుస్తుంది.