రవితేజ- హరీష్- రైడ్

2018లో వచ్చిన అజయ్ దేవగన్ సినిమా రైడ్. నిజాయతీ గల ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ కథ. పక్కా మాంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని పాయింట్లు వున్న కథ.  Advertisement ఇప్పుడు దీన్ని…

2018లో వచ్చిన అజయ్ దేవగన్ సినిమా రైడ్. నిజాయతీ గల ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ కథ. పక్కా మాంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని పాయింట్లు వున్న కథ. 

ఇప్పుడు దీన్ని తీసుకుని తెలుగులో చేయడానికి రెడీ అవుతున్నారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేతలు. ఇప్పటికే ఈ బ్యానర్ లో రెండు సినిమాలు చేసారు రవితేజ. మళ్లీ మరో సినిమా వాళ్లకే చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు అన్నీ పూర్తి కాగానే గోపీచంద్ మలినేని-మైత్రీ సినిమా స్టార్ట్ చేస్తారు. దాంతో పాటే సమాంతరంగా రైడ్ రీమేక్ కూడా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా జనవరి నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. దర్శ‌కుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు పని చేస్తారని తెలుస్తోంది.

టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు సెట్ మీద వున్నాయి. ఈ రెండు సినిమాల మీద మంచి అంచనాలు వున్నాయి. వాటి తరువాత గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ అంటే అది కూడా మంచి లైనప్ నే. వీటి మధ్యలో సితార సంస్థ సినిమా కూడా వుంది.