ఆచార్య చుట్టూ టెన్షన్లు

మరో రెండు రోజులు. ఆచార్య సినిమా విడుదల కాబోతోంది. చాలా గ్యాప్ తరవాత ఖైదీ నెం 150 సినిమా తో మెగాస్టార్ మళ్లీ తెరపైకి వచ్చారు. పాటలు సూపర్ హిట్. సినిమా పక్కా కమర్షియల్…

మరో రెండు రోజులు. ఆచార్య సినిమా విడుదల కాబోతోంది. చాలా గ్యాప్ తరవాత ఖైదీ నెం 150 సినిమా తో మెగాస్టార్ మళ్లీ తెరపైకి వచ్చారు. పాటలు సూపర్ హిట్. సినిమా పక్కా కమర్షియల్ ఫార్మాట్, వైవిధ్యమైన పాయింట్ వుండడంతో సూపర్ డూపర్ సక్సెెస్ అయ్యింది. మలి సినిమా సైరా. భారీ సినిమా, మొదలైన దగ్గర నుంచి విపరీతమైన ప్రచారం, అనేక కథనాలు. దాని వల్ల టాక్ డివైడ్ అయినా, ఓవర్ బడ్జెట్ అన్నది సమస్య అయింది తప్ప, కమర్షియల్ గా ఫెయిల్యూర్ కాలేదు. ముచ్చటగా మూడో సినిమా ఆచార్య. ఈ సినిమాకు అన్నీ సమస్యలే అవుతూ వస్తున్నాయి.

సినిమాకు కరోనా అన్నది పెద్ద విలన్ గా మారింది ఈ సినిమాకు. రెండు వందల కోట్ల మేరకు మార్కెట్ స్టామినా వున్న ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా మారడానికి కారణం కరోనా తప్ప మరోటి కాదు. సినిమా మీద వడ్డీల భారం మోయలేనంతగా పడడంతో నిర్మాత సేఫ్ గా వుండాలంటే కీలకమైన ముగ్గురూ అంటే హీరోలు ఇద్దరూ, దర్శకుడు రెమ్యూనిరేషన్లు తీసుకోకుండా వుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హీరో చిరంజీవి వరుసగా సినిమాలు ఒకె చేసి వున్నారు. ఆ సినిమాలు అన్నింటికీ బ్యాక్ బోన్, అట్రాక్షన్ రెండూ ఆయన మాత్రమే. మెహర్ రమేష్, బాబీ, మోహన్ రాజా కాంబినేషన్ మరింత యాడ్ చేసేంత సీన్ వుండదు. సినిమాలను చిరంజీవి తన భుజాల మదీ మోసుకు వెళ్లాల్సిందే. కానీ ఆచార్య అలా కాదు. రామ్ చరణ్, కొరటాల శివ అనే మరో రెండు పవర్స్ యాడ్ అయ్యాయి. ఇలా మూడు పవర్స్ యాడ్ అయిన సినిమా కూడా క్రౌడ్ ను పుల్ చేయకపోతే, మిగిలిన సినిమాలు ఎలా వుంటాయో అన్న భయం ఒకటి మెగా ఫ్యాన్స్ లో వుంది.

సినిమా విడుదల మరో రెండు రోజుల్లో వుంది అన్నా కూడా ఇప్పటి వరకు సరైన ఓపెనింగ్స్ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఎందుకిలా? అన్నదే అర్థం కావడం లేదు. ప్రాజెక్ట్ స్టేల్ అయింది, అందువల్లే అని ఓ టాక్. మెగాస్టార్ సినిమాకు స్టేల్ అన్నది ఎలా వర్తిస్తుంది. ఆర్ఆర్ఆర్ కూడా నాలుగెళ్ల పాటు తీసారు కదా?

ఇదిలా వుంటే కెజిఎఫ్ 2 ఇంకా అర్బన్ సెంటర్లలో కాస్త బలంగానే వుంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు నైజాంలో థియేటర్లు కాస్త సమస్యే. కానీ ఇలాంటపుడు ఏమవుతుంది. థియేటర్లు దొరికితే చాలనుకుంటారు. అడ్వాన్స్ లు రాలవు. ఒప్పుకున్న మొత్తాన్ని బయ్యర్ కట్టాల్సి వుంటుంది. అడ్వాన్స్ లు రాకుండా బయ్యర్ అంత మొత్తం తెేవాలంటే అంత సులువు కాదు. ఓపెనింగ్ కుమ్మేసే పరిస్థితి వుంటే అడ్వాన్స్ లు అవే వస్తాయి. కానీ ఇక్కడ అదీ సమస్యగానే వుంది.

దర్శకుడు కొరటాల సన్నిహితుడు సుధాకర్ కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాలకు తీసుకున్నారు. గుంటూరులో థియేటర్లు అన్నీ యువి చేతిలో ఎక్కువగా వున్నాయి. థియేటర్లు ఇమ్మంటే ఇస్తారు కానీ అడ్వాన్స్ లు మాత్రం రాల్చరు. విశాఖ ఏరియాలో థియేటర్లు ఎక్కువగా దిల్ రాజు చేతిలో వున్నాయి. అక్కడా అదే పరిస్థితి. ఇంక కృష్ణ జిల్లాకు వస్తే సురేష్ ఫిలింస్ చేతిలో వున్నాయి ఎక్కువగా. అక్కడా అడ్వాన్స్ లు అంతగా రాలవు. ఇలా అడ్వాన్స్ లు రాలనపుడు, 50 నుంచి 60 కోట్ల రేషియోలో మూడు ఏరియాలకు డబ్బులు కట్టాలి. అది చాలా టెన్షన్ వ్యవహారం.

ఈ సినిమాకు సోలో నిర్మాత నిరంజ‌న్ రెడ్డి. కొణిదల అన్నది కేవలం బ్యానర్ వరకే. నిరంజ‌న్ రెడ్డి కూడా నాలుగున్నర కోట్ల ప్రాఫిట్ కు ప్రాజెక్టు మొత్తాన్ని దర్శకుడు కొరటాలకు ఇచ్చేసారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. అందువల్ల కష్ట నష్టాలు అన్నీ కొరటాలనే మోయాల్సి వుంటుంది. సినిమా ఖర్చులు, వడ్డీలు అన్నీ పోయినా పాతిక, ముఫై కోట్లకు మించి మిగిలేలా లేవు. వాటిల్లోంచే చిరు,చరణ్ లకు కలిపి 70 కోట్ల రెమ్యూనిరేషన్ ను సెట్ చేయాలి. కొరటాల తీసుకోవాలి. లేదూ అంటే అన్నీ వదిలేసుకోవాలి.

ఓ ప్రామిసింగ్ కాంబినేషన్ గా మొదలైన సినిమా అన్ని రకాల మలుపులు తిరిగి ఆఖరికి కాస్ట్ ఫెయిల్యూర్ గా మారడం అన్నది కాస్త విషాదమే. సినిమా అన్ని విధాలా బాగుందని టాక్ వస్తే, ఆ ఆనందమే లాభం అవుతుంది ఇటు కొరటాలకు అయినా, అటు హీరోలకు అయినా.