30 రోజుల్లో ప్రేమ కథ తరువాత సినిమా కోసం చూస్తున్నారు దర్శకుడు మున్నా.
ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌కు వెళ్దామని ప్రయత్నించి, విఫలమై, ఒక సినిమా సెట్ మీద వుంచుకుని సరైన అవకాశాల కోసం చూస్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
ఏజెంట్, భోళాశంకర్ లాంటి దారుణ పరాజయాలు చవి చూసి, చేతులు కాల్చుకుని, మంచి ప్రాజెక్టుల కోసం చూస్తున్నారు నిర్మాత అనిల్ సుంకర.
ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసారు. ఓ ప్రాజెక్ట్ ఓకె చేసుకున్నారు. మంచి కథ, కథనాలు కుదిరాయి అని అంటున్నారు. త్వరలో ఈ సినిమా మొదలు అవుతుంది. ప్రస్తుతానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమాను 14 రీల్స్ కు చేస్తున్నారు.
ఇదే దర్శకుడు మున్నా అదే 14 రీల్స్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. 14రీల్స్.. అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామ్యంలో సినిమాలు చేసారు కూడా. ఆ విధంగా ఈ ముగ్గురు ఇంటర్ లింక్డ్. ఈ సినిమా అలాగే సెట్ అయిందేమో?